Niharika Konidela: పదకొండు మంది హీరోలతో నిహారిక కొణిదెల మూవీ - యూత్‌ఫుల్ టైటిల్ ఫిక్స్!
Niharika Konidela: నిహారిక కొణిదెల ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న మూవీకి కమిటీ కుర్రాళ్లు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పదకొండు మంది హీరోలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.
Niharika Konidela: విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నిహారిక కొణిదెల యాక్టింగ్‌పై ఫోకస్ పెడుతూనే మరోవైపు ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో సొంతంగా ఓ బ్యానర్‌ను నెలకొల్పింది నిహారిక కొణిదెల.
ఈ బ్యానర్‌లో ఇప్పటివరకు వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిలిమ్స్ మాత్రమే చేసింది నిహారిక. పింక్ ఎలిఫెంట్ సంస్థలో ఫస్ట్ టైమ్ కాన్సెప్ట్ ఓరియెంటెండ్ కథాంశంతో ఓ సినిమాను తెరకెక్కిస్తోంది నిహారిక. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కమిటీ కుర్రాళ్లు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా ఏప్రిల్ ఫస్ట్‌వీక్‌లో అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
పదకొండు మంది హీరోలు...
కమిటీ కుర్రాళ్లు మూవీతో పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేస్తోంది నిహారిక. ఈ సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహిస్తోన్నాడు. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ మూవీని నిర్మిస్తున్నారు.
కమిటీ కుర్రాళ్లు మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ తో పాటు పలువురు యూట్యూబర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట మిగిలిన హీరోలుగా కనిపించబోతున్నారు. శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో సింగర్ అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్నట్లు సమాచారం.
ఒక మనసుతో ఎంట్రీ...
నాగశౌర్య ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. మనస్పర్థల కారణంగా రెండేళ్లకే ఈ జంట విడిపోయారు.
వాట్ ది ఫిష్ తో రీఎంట్రీ...
విడాకుల తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక వాట్ ది ఫిష్ పేరుతో దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో అష్టలక్ష్మి అనే అమ్మాయిగా యాక్షన్ ప్రధానంగా సాగే పాత్రలో నిహారిక కనిపించబోతున్నాడు.
తమిళంలో...
తెలుగుతో పాటు ఈ ఏడాది తమిళంలో కూడా ఓ మూవీకి నిహారిక గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మద్రాస్కరన్ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఆర్‌డీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. గత ఏడాది డెడ్‌పిక్సెల్స్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది నిహారిక కొణిదెల. గతంలో విజయ్ సేతుపతితో కలిసి ఒరు నల్ల నాల్ సోల్రెన్ అనే తమిళ సినిమా చేసింది నిహారిక. మద్రాస్కరన్ తమిళంలో ఆమె చేస్తోన్న సెకండ్ మూవీ. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న చెఫ్ మంత్ర సీజన్ 3కి నిహారిక హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
టాపిక్