Committee Kurrollu OTT: సూపర్ హిట్ మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Committee Kurrollu OTT Platform: తక్కువ బడ్జెట్‍తో రూపొందిన కమిటీ కుర్రోళ్ళు సినిమా మంచి హిట్ కొట్టింది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ కామెడీ మూవీ అంచనాలను మించి కలెక్షన్లను దక్కించుకుంటోంది. తాజాగా ఈ మూవీకి ఓటీటీ డీల్ జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది.
విలేజ్ బ్యాక్‍డ్రాప్ కామెడీ మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’ అంచనాలకు మించి విజయం సాధించింది. తక్కువ బడ్జెట్‍తో ఎక్కువ మంది కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కొట్టింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు. ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‍తో ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. అయితే, తాజాగా కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది.
ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే!
కమిటీ కుర్రోళ్ళు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని మంచి ధరకే ఈటీవీ విన్ తీసుకుందని టాక్. ఈ సినిమాకు ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు.
కమిటీ కుర్రోళ్ళు సినిమాను తీసుకునేందుకు ముందుగా ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ముందుకు రాలేదని ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‍లో నిహారిక కొణిదెల చెప్పారు. అయితే, పాజిటివ్ టాక్ వచ్చాక ఓటీటీ హక్కుల డిమాండ్ డబుల్ అయిందని అన్నారు. తనను కొన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు ఈ మూవీ కోసం సంప్రదించాయని తెలిపారు. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ తీసుకున్నట్టు సమాచారం వెల్లడైంది. ఆహా కూడా ఈ మూవీ హక్కులను తీసుకున్నట్టు రూమర్లు ఉన్నాయి.
కమిటీ కుర్రోళ్ళు కలెక్షన్లు
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.15.6 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలకు మిక్స్డ్ టాక్ రావటంతో కమిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో ఇంకా జోరుచూపిస్తోంది. థియేట్రికల్ రన్ బాగా కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ఈ లోబడ్జెట్ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది.
కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యధు వంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మొత్తంగా 11 మంది హీరోలు అంటూ మూవీ టీమ్ చెబుతూ వస్తోంది. ఈ మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివకుమార్, తేజస్వి రావ్, విశిక కీలకపాత్రలు పోషించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కమిటీ కుర్రోళ్ళు సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు యధు వంశీ ఈ మూవీని తెరకెక్కించిన తీరు ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం నిర్మాత నిహారిక కొణిదెల సహా మూవీ టీమ్ సభ్యులు జోరుగా ప్రమోషన్లు చేశారు. చిత్రం కూడా ఆకట్టుకోవడంతో అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తోంది. ఈ మూవీ టీమ్‍కు మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, నేచురల్ స్టార్ నాని సహా మరికొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలు అభినందనలు తెలిపారు.