New Telugu TV Serial: డిఫరెంట్ లవ్ స్టోరీతో కొత్త టీవీ సీరియల్ ‘నువ్వే కావాలి’.. టెలికాస్ట్ ఎప్పుడంటే..
Nuvve Kavali TV serial: కొత్త సిరీయల్ ‘నువ్వే కావాలి’ వస్తోంది. జెమినీ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. టెలికాస్ట్ టైమింగ్స్ ఫిక్స్ అయ్యాయి. ప్రోమోల ద్వారా స్టోరీలైన్ కూడా వెల్లడైంది. ఈ సీరియల్ వివరాలివే..
టీవీ ఛానెళ్లలో సీరియళ్లకు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే ఏదైనా సీరియల్ పూర్తయితే.. వెంటనే కొత్తవి వచ్చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో జెమినీ టీవీ ఛానెల్‍లో కొత్త సీరియల్స్ వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు నయా టీవీ సీరియల్ సిద్ధమైంది. ‘నువ్వే కావాలి’ పేరుతో ఈ సిరీయల్ వస్తోంది. శివాంక్, బిగ్‍బాస్ ఫేమ్ వసంతి కృష్ణన్ ఈ సిరీస్‍లో హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సీరియల్ వివరాలు ఇక్కడ చూడండి.
టెలికాస్ట్ ఎప్పుడంటే..
‘నువ్వే కావాలి’ సీరియల్ జెమినీ ఛానెల్‍లో సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ప్రైమ్ టైమ్‍లోనే ఈ సీరియల్ వస్తోంది.
స్టోరీలైన్ ఇదే..
స్వార్థంతో జీవిస్తున్న ఓ అబ్బాయికి.. నిస్వార్థంగా ఉండే అమ్మాయికి మధ్య ప్రేమ, వారి మధ్య బంధం చుట్టూ నువ్వే కావాలి స్టోరీ సాగుతుంది. భిన్నంగా ఆలోచించే ఇద్దరి మధ్య డిఫరెంట్ ప్రేమ కథతో ఈ సీరియల్ ఉండనుంది. ఇప్పటికే ఈ సిరీయల్‍కు సంబంధించిన ప్రోమోలను జెమినీ టీవీ తీసుకొచ్చింది.
రాజా (శివాంక్) ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. తన బాబాయ్ మోసం చేయటంతో ఆస్తి, డబ్బు పోగొట్టుకుంటాడు. తన తండ్రి అమాయకంగా ఉండటంతోనే బాబాయి అలా చేశాడని భావిస్తుంటాడు. బాబాయితో పాటు తండ్రిపైనే ద్వేషంతో ఉంటాడు. స్వార్థంతో జీవిస్తుంటాడు. ఎవరికీ ఏదీ ఇవ్వకుండా ఉంటాడు. మరోవైపు, అక్షయ (వసంతి కృష్ణన్) కాలేజీలో గోల్డ్ మెడల్ సాధిస్తుంది. నిస్వార్థంగా ఉంటుంది. అవసరంలో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తుంటుంది. కుటుంబం అంటే ప్రాణంగా ఉంటుంది. ఇలా.. రాజా, అక్షయ జీవితంలో చాలా భిన్నంగా ఉంటారు. అయితే, వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరుతుంది? వీరి జీవితం ఎలా సాగుతుందనేదే ఈ సీరియల్‍లో ఉంటుంది.
ఓ గుడిలో అక్షయ అన్నదానం చేస్తూ అందరికీ కొసరికొసరి వడ్డిస్తున్నట్టు నువ్వే కావాలి సీరియల్ ప్రోమోను జెమినీ టీవీ ఇటీవల తీసుకొచ్చింది. అదే గుడిలో ప్రసాదాన్ని కూడా పిసినారిగా వడ్డిస్తుంటాడు రాజా. ముందు ప్రసాదం పెట్టి.. దాంట్లో ఉన్న దాన్ని వెనక్కి తీసుకుంటాడు. మిగల్చకుండా తినండి అని రాజా అంటే.. “మిగల్చడానికి ఇక్కడ ఏముంది. వీడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో పాపం” అని ఓ వ్యక్తి అంటాడు.
నలుగురికి సాయం చేసే శక్తిని తనకు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటుంది అక్షయ. “సహాయాలు చేయడం, సాంబ్రాణిలు తిప్పడం మన వల్ల కాదు కానీ.. నువ్వు ఎవరికి ఏ వరం ఇవ్వాలనుకున్నా ముందు నాకే ఇవ్వాలి” అని స్వార్థంతో కోరుకుంటాడు రాజా. అతడి చేతిలోని ప్రసాదాన్ని వేరే వాళ్లకు అక్షయ ఇచ్చేస్తుంది. దీంతో వీడికి ఈ అమ్మాయే కరెక్ట్ అని రాజా ఫ్యామిలీ అనటంతో ఈ ప్రోమో ముగిసింది. ఈ ప్రోమోతోనే స్టోరీలైన్‍ను జెమినీ టీవీ రివీల్ చేసింది.
తమిళ సీరియల్ మరుమగల్‍కు రీమేక్‍గా నువ్వే కావాలి సీరియల్ రూపొందింది. జెమినీ టీవీలో సెప్టెంబర్ 23 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 గంటలకు నువ్వే కావాలి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది.