ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం(Itlu Maredumilli Prajaneekam) - జీ5 (Zee5 Ott)అల్లరి నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా జీ5 ఓటీటీలో డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. సామాజిక సందేశంతో రూపొందిన ఈ సినిమాతో ఏఆర్ మోహన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇందులో మారేడుమిల్లి అనే గిరిజన ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అల్లరి నరేష్ నటించాడు. ఆనంది హీరోయిన్‌గా కనిపించింది.,మసూద (Masooda) - ఆహా (Aha OTT)హారర్ కథాంశంతో రూపొందిన మసూద సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో బుధవారం (డిసెంబర్ 21న) విడుదలైంది. మసూద సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాను థియేటర్లలో దిల్‌రాజు రిలీజ్ చేశాడు. దయ్యం బారి నుంచి తన కూతురును కాపాడుకున్న ఓ తల్లి కథతో ఈ సినిమా తెరకెక్కింది.,అక్షయ్ కుమార్ రామ్‌సేతు (Ramsetu) - అమెజాన్ ప్రైమ్రామ్ సేతు సినిమాతో ఈ ఏడాది అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడంతో పాటు గ్రాఫిక్స్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ సినిమా డిసెంబర్ 23న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. రామ్ సేతు సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు.,ది టీచర్ - నెట్‌ఫ్లిక్స్ (Netflix)అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన మలయాళ చిత్రం ది టీచర్ డిసెంబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రివేంజ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈసినిమాకు వివేక్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా అమలాపాల్ నటించింది.,జయ జయ జయ జయహే (మలయాళం) - డిసెంబర్ 23 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్,గ్లాస్ఆనియన్ - డిసెంబర్ 23 -నెట్‌ఫ్లిక్స్,తారా వర్సెస్ బిలాల్ - డిసెంబర్ 23 - నెట్‌ఫ్లిక్స్,కారి - డిసెంబర్ 23 - జీ5,టాప్ గన్ మావెరిక్ - అమెజాన్ ప్రైమ్టామ్ క్రూజ్ హీరోగా నటించిన టాప్ గన్ మావెరిక్ ఈసినిమా డిసెంబర్ 23న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. 1986లో రూపొందిన టాప్ గన్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. టాప్ గన్ మావెరిక్ ఈ ఏడాది హాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.,జాక్ రయాన్ సీజన్ 3 - డిసెంబర్ 21- అమెజాన్ ప్రైమ్