New OTT Glopixs: సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ గ్లోపిక్స్ ప్రారంభం.. 360 డిగ్రీల ఎంటర్‌టైన్‌మెంట్.. ఇతర ఓటీటీలకు పోటీగా!
New OTT Platform Glopixs Launched: డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ గ్లోపిక్స్ లాంచ్ అయింది. మన సంస్కృతి, మూలాల్లోని కథలను గ్లోబల్‌గా చెబుతూ 360 డిగ్రీల ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఓటీటీ వ్యవస్థాపలుకు చెబుతున్నారు.
Glopixs OTT App Launch: ప్రస్తుతం ఓటీటీల వినియోగం ఎలా ఉందో తెలిసిందే. థియేట్రికల్ రిలీజ్ కంటే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ కోసం ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మార్కెట్‌లోకి సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వస్తున్నాయి.
గ్లోపిక్స్ ఓటీటీ లోగో లాంచ్
అలా వినోద రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకు వచ్చేందుకు కొత్త ఓటీటీ "గ్లోపిక్స్" రాబోతోంది. బెంగళూరు బేస్డ్‌గా ఈ కొత్త ఓటీటీ సంస్థ "గ్లోపిక్స్" కార్యకలాపాలు సాగించనుంది. ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది. గురువారం (జనవరి 2)న గ్లోపిక్స్ ఓటీటీ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుంది.
మూడు చోట్ల ఘనంగా
గ్లోపిక్స్‌ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్ సన్నయ్య ఫౌండర్ మెంబర్/సిఎమ్ఓ ఫౌండింగ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్/సిటిఓ, రూపేశ్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్‌గా వ్యవహరించనున్నారు. గురువారం నాడు ఈ గ్లోపిక్స్ ఓటీటీ లోగోను సౌత్‌లో మూడు చోట్ల ఘనంగా లాంచ్ చేశారు.
360 డిగ్రీల ఎంటర్‌టైన్‌మెంట్
బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో గ్లోపిక్స్ ఓటీటీ లోగోను లాంచ్ చేశారు. ఇక ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలు అంటూ 360 డిగ్రీల ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతున్నారు. ఇతర ఓటీటీ సంస్థలకు పోటీనిచ్చే విధంగా ఇందులో కంటెంట్ ఉంటుందని చెబుతున్నారు.
మన మూలాల్లోంచి కథను
ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోపిక్స్ ఫౌండర్ మెంబర్ మారుతి రాజీవ్ మాట్లాడుతూ.. "నేడు మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మన కల్చర్, మన సంస్కృతి, మన మూలాల్లోంచి కథలను గ్లోబల్‌గా అందించేందుకు మా గ్లోపిక్స్‌ను ప్రారంభిస్తున్నాం. మంచి కంటెంట్, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తున్నాం" అని అన్నారు.
గ్లోబల్ లెవెల్‌కు
గ్లోపిక్స్ ఫౌండింగ్ మెంబర్ లోకేష్ మాట్లాడుతూ.. "అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అందరికీ అంతా మంచి జరగాలి. మేం మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రాంతీయతను చాటేలా, లోకల్ టాలెంట్, కల్చర్‌ను ఎంకరేజ్ చేసేందుకు గ్లోపిక్స్‌ను స్టార్ట్ చేస్తున్నాం. అన్ని రకాల కంటెంట్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మన కంటెంట్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం" అని తెలిపారు.
ఈ ఏడాది వేసవిలో
గ్లోపిక్స్ హైదరాబాద్ కంటెంట్ హెడ్ రూపేశ్ మాట్లాడుతూ.. "మంచి కంటెంట్, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ గ్లోపిక్స్‌ను తీసుకొస్తున్నాం" అని వెల్లడించారు. అయితే, ఈ గ్లోపిక్స్ ఓటీటీ సేవలు ఈ ఏడాది వేసవిలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఓటీటీలు
ఇదివరకు తెలుగులో ఆహా, ఈటీవీ విన్ ఓటీటీలు ఉండగా అన్ని భాషల్లో ఇండియావైడ్‌గా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోని లివ్, జియో సినిమా, యాపిల్ ప్లస్ టీవీ, లయన్స్ గేట్ ప్లే, బుక్ మై షో, మనోరమ మ్యాక్స్ వంటి ఇతర ఓటీటీలు సేవలు అందిస్తున్నాయి.