New OTT JioHotstar: ఒకే ఓటీటీలో డబుల్ వినోదం- జియో హాట్‌స్టార్‌లో అదనంగా చూసే సినిమాలు, సీరియల్స్, స్పోర్ట్స్ ఇవే!
New OTT Jio Hotstar Movies Web Series Serials: న్యూ ఓటీటీగా జియో హాట్‌స్టార్ వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామస్స్ విలీనం అయి ఒకే ఓటీటీ సంస్థగా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో జియో హాట్‌స్టార్ ఓటీటీలో అదనంగా చూసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ ఏంటో లుక్కేద్దాం.

New OTT Jio Hotstar Movies Web Series Serials: సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి జియో హాట్‌స్టార్ వచ్చేసింది. ఇదివరకు ఉన్న అగ్ర ఓటీటీ సంస్థలు అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండు విలీనం అయి ఒకే జియో హాట్‌స్టార్ లేదా జియోస్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించాయి.
ఇలా అప్డేట్ చేసుకోండి
ఫిబ్రవరి 14న లాంచ్ అయిన జియో హాట్‌స్టార్ ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండింట్లోని కంటెంట్‌ను ఒకే వేదికపై అంటే జియో హాట్‌స్టార్‌లో వినియోగదారులకు అందిస్తోంది. అంటే, ఒకే ఓటీటీలో డబుల్ వినోదం అన్నమాట. ఇందుకోసం ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్ యూజర్స్) లేదా యాపిల్ స్టోర్ (యాపిల్ యూజర్స్)కి వెళ్లి హాట్‌స్టార్ యాప్‌ను అప్డేట్ చేసుకోవడమే.
అంతర్జాతీయ స్టూడియోల కంటెంట్
ఈ జియోహాట్‌స్టార్ ఓటీటీలో వందలాది సినిమాలు, వెబ్ సిరీస్‌లతోపాటు మరెన్నో వివిధ రకాల కంటెంట్‌ను చూడొచ్చు. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ ఒరిజినల్ కంటెంట్‌తో పాటు, జియో హాట్‌స్టార్‌లో పలు అంతర్జాతీయ స్టూడియోలకు సంబంధించిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ షోలు కూడా అందుబాటులో వచ్చాయి.
అదనపు కంటెంట్
ఇప్పుడు జియో హాట్‌స్టార్ ఓటీటీలో హాట్‌స్టార్ స్పెషల్స్, డిస్నీ, మార్వెల్, పిక్సర్, స్టార్ వార్స్‌కు సంబంధించిన కంటెంట్‌తోపాటు అదనంగా హెచ్‌బీఓ, ఎన్‌బీసీ యూనివర్సల్ పీకాక్, పారామౌంట్ ప్లస్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, నేషనల్ జీవోగ్రాఫిక్ వంటి అంతర్జాతీయ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
క్రికెట్-స్పోర్ట్స్ ఈవెంట్స్
అలాగే, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, దేశవాళీ టోర్నమెంట్లతో సహా పలు ప్రధాన ఐసీసీ ఈవెంట్స్, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్, ఖో ఖో వరల్డ్ కప్ 2025 కూడా హాట్‌స్టార్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎప్పటిలా వచ్చే స్టార్ మా సీరియల్స్‌తోపాటు కలర్స్ ఛానెల్‌కు సంబంధించిన ధారావాహికలను జియోస్టార్ ఓటీటీలో వీక్షించవచ్చు.
వైదొలిగిన కంటెంట్ కూడా
ఇవేకాకుండా ఇదివరకు హాట్‌స్టార్ నుంచి వైదొలిగిపోయి జియో సినిమాకు షిఫ్ట్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్స్, ది లాస్ట్ ఆఫ్ హజ్ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా, 50 కోట్లకు పైగా యూజర్ బేస్, మూడు లక్షల గంటలకు పైగా కంటెంట్‌తో ఈ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ భారత డిజిటల్ స్ట్రీమింగ్ మార్కెట్‌లో అతిపెద్దదిగా అవతరించింది.
హీరో హీరోయిన్స్ రియాక్షన్
ఇవాళ లాంచ్ సందర్భంగా జియో హాట్‌స్టార్ ఇన్ఫినిటీ పాసిబులిటీస్ అంటూ ఓ వీడియోను పంచుకుంది జియోస్టార్ ఓటీటీ. ఈ వీడియోలో స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, నాగార్జున, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, రణ్‌బీర్ కపూర్, జాన్వీ కపూర్, హృతిక్ రోషన్, రానా దగ్గుబాటి, అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, ఉర్ఫీ జావేద్, తమిళ స్టార్ కార్తీ, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తోపాటు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ కంటెస్టెంట్స్ అభయ్ నవీన్, ఆదిత్య ఓం, హిందీ దర్శకనిర్మాత కరణ్ జోహార్ జియో హాట్‌స్టార్ ప్రమోషన్స్ చేశారు.
సంబంధిత కథనం