OTT Releases This Week:,అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై - డిస్నీ ప్లస్ హాట్స్టార్అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన బటర్‌ఫ్లై సినిమా డిసెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఘంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించాడు. కిడ్నాప్‌కు గురైన అక్క పిల్లలను కాపాడుకోవడానికి పోరాటం చేసే ఓ యువతి కథతో ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్ట్‌గా ఓటీటీ ఈ సినిమా రిలీజైంది.,గోల్డ్ - అమెజాన్ ప్రైమ్పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార జంటగా నటించినమలయాళ సినిమా గోల్డ్ అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 29న రిలీజైంది. ప్రేమమ్ ఫేమ్ ఆల్పోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించాడు. కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని దొంగిలించిన ఓ వ్యక్తికి ఎదురైన పరిణామాలతో ఈ సినిమా రూపొందింది.,మట్టి కుస్తి - నెట్ఫ్లిక్స్టాలీవుడ్ అగ్ర హీరో రవితేజ నిర్మించిన మట్టికుస్తీ సినిమా జనవరి 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విష్ణువిశాల్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చెల్లా అయ్యావు దర్శకత్వం వహించాడు. మహిళల్ని చిన్నచూపు చూడకూడదనే సందేశాత్మక కథాంశంతో తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా రూపొందింది.,విజయ్ సేతుపతి డీఎస్‌పీ - సన్ నెక్స్ట్, నెట్ఫ్లిక్స్విజయ్ సేతుపతి హీరోగా నటించిన డీఎస్‌పీ సినిమా శుక్రవారం నుంచి (నేడు) నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నది. పోన్‌రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోంది.,రాకెట్ గ్యాంగ్ - జీ5,ఆర్ యా పార్ (వెబ్ సిరీస్) -డిస్నీ ప్లస్ హాట్‌స్టార్,పట్టాత్తు అసరన్ (తమిళ్) - నెట్‌ఫ్లిక్స్,డబుల్ ఎక్స్ఎల్ (హిందీ) - నెట్‌ఫ్లిక్స్,ఉడాన్‌పల్ (తమిళం) - ఆహా తమిళ్,వైట్ నాయిస్ (ఇంగ్లీష్) - నెట్‌ఫ్లిక్స్,ఛోటా భీమ్ (వెబ్ సిరీస్) (హిందీ) - నెట్‌ఫ్లిక్స్,చికాగో పార్టీ ఆంటీ (వెబ్‌సిరీస్) - నెట్‌ఫ్లిక్స్,సీక్రెట్స్ ఆఫ్ సమ్మర్ (సిరీస్) - నెట్‌ఫ్లిక్స్,ఆల్ఫా మేల్స్ (వెబ్‌సిరీస్) - నెట్‌ఫ్లిక్స్