Shyam Singha Roy: ఆస్కార్ రేసులో శ్యామ్ సింగ‌రాయ్ – ఈ కేటగిరీలు వినలేదంటూ నెటిజన్ల ట్రోల్స్-netizens trolled shyam singha roy in oscar race is a fake ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Netizens Trolled Shyam Singha Roy In Oscar Race Is A Fake

Shyam Singha Roy: ఆస్కార్ రేసులో శ్యామ్ సింగ‌రాయ్ – ఈ కేటగిరీలు వినలేదంటూ నెటిజన్ల ట్రోల్స్

Nelki Naresh Kumar HT Telugu
Aug 18, 2022 08:18 AM IST

నాని(Nani) హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్(Shyam Singha Roy) సినిమా ఆస్కార్ ఎంట్రీ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌చారంపై నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ కు కారణం ఏమిటంటే...

నాని, సాయిపల్లవి
నాని, సాయిపల్లవి (twitter)

Shyam Singha Roy in Oscar Race: నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్యామ్‌సింగ‌రాయ్ చిత్రం గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా తెర‌కెక్కిన ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి(sai pallavi), కృతిశెట్టి హీరోయిన్లుగా న‌టించారు. రెండు డిఫ‌రెంట్ టైమ్ పీరియ‌డ్స్‌లో దేవ‌దాసి వ్య‌వ‌స్థ కార‌ణంగా మ‌హిళ‌లు ఎదుర్కొనే ఇబ్బందుల కు పున‌ర్జ‌న్మ‌ల పాయింట్‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

నాని, సాయిపల్లవి నటనకు మంచి పేరు వచ్చినా కమర్షియల్ మాత్రం యావరేజ్ గా సినిమా నిలిచింది. కాగా ఈ సినిమా ఆస్కార్ (Oscar awards) ఎంట్రీలో నిలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పీరియాడిక‌ల్ డ్రామా,బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌,క్లాసిక‌ల్ క‌ల్చ‌ర‌ల్ డ్యాన్స్ విభాగాల్లో శ్యామ్‌సింగ‌రాయ్ ఆస్కార్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. శ్యామ్‌సింగ‌రాయ్ ఆస్కార్ ఎంట్రీ వార్తలపై నెటిజ‌న్లు భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. క్లాసిక‌ల్ క‌ల్చ‌ర‌ల్ డ్యాన్స్ అనే కేట‌గిరి ఆస్కార్‌లో లేదంటూ చెబుతున్నారు. ఇదే కాదు పీరియాడిక‌ల్ డ్రామా విభాగంలో ప్ర‌త్యేకంగా ఆస్కార్ అవార్డులు ఇవ్వ‌రంటూ మ‌రికొంద‌రు ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. . ఈ కొత్త కేటగిరీలను ఎప్పుడు ప్రవేశపెట్టారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కావాల‌నే చేస్తున్న ప్ర‌చారం ఇద‌ని అంటున్నారు. ఆస్కార్‌లో లేని కొత్త కేట‌గిరిల‌ను సృష్టించ‌డం కామెడీగా ఉంద‌ని చెబుతున్నారు. అంతేకాకుండా 2021లో శ్యామ్‌సింగ‌రాయ్ సినిమా రిలీజ్ అయ్యింది.

ఒక‌వేళ ఈ సినిమాకు ఆస్కార్ వ‌స్తే 2022లో రావాలి. ఇప్ప‌టికే ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల‌ను ఇచ్చేశారు. 2023లో అవార్డ్ ఎలా ఇస్తారూ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఆస్కార్ ఎంట్రీ వార్త‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కుహీరో నానితో పాటు చిత్ర యూనిట్ ఎవరూ స్పందించ‌లేదు.

IPL_Entry_Point