Niharika Konidela: నిహారిక కొణిదెల తమిళ మూవీ సాంగ్‌పై దారుణంగా ట్రోల్స్ - మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నావంటూ కామెంట్స్
Niharika Konidelaమెగా డాటర్ నిహారిక కొణిదెల మద్రాస్‌కారణ్ అనే తమిళ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ప్రోమోను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను ఉద్దేశిస్తూ నెటిజన్లు నిహారికను తెగ ట్రోల్ చేస్తోన్నారు.
Niharika Konidela: చైతన్య జొన్నలగడ్డతో విడాకుల తర్వాత తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇటీవలే ప్రొడ్యూసర్‌గా కమిటీ కుర్రాళ్లు మూవీతో పెద్ద హిట్‌ను అందుకున్నది. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ కామెడీ డ్రామా మూవీ ఇరవై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిహారికకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. కమిటీ కుర్రాళ్లు తర్వాత తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది నిహారిక.
మద్రాస్‌కారణ్ మూవీ...
ప్రొడ్యూసర్‌గానే కాకుండా యాక్టర్‌గానూ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది నిహారిక. తమిళ మూవీ మద్రాస్‌కారణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు షేన్ నిగమ్ హీరోగా నటిస్తోన్న ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
మణిరత్నం సఖి ...
మద్రాస్‌కారణ్ కోసం మణిరత్నం సఖి మూవీలోని కాయ్‌లవ్ చెడుగుడు అనే పాటను రీమిక్స్ చేస్తోన్నారు. ఈ సాంగ్‌ను శనివారం రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ డ్యూయెట్ సాంగ్ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో షేన్ నిగమ్, నిహారిక కెమిస్ట్రీ, రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్. గతంలో నిహారిక చేసిన సినిమాలకు మించి రొమాంటిక్‌గా ఈ సాంగ్ కనిపిస్తోంది.
సాంగ్‌పై ట్రోల్స్....
ఈ సాంగ్‌ను ఉద్దేశిస్తూ నెటిజన్లు నిహారికను దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఇలాంటి పాటల్లో నటించి నిహారిక మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తోందని అంటున్నారు. ఈ టైప్ సినిమాలు చేయడం అవసరమా ...చక్కగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసుకోవచ్చుగా అంటూ కామెంట్స్ పెడుతోన్నారు. ప్రోమోలోనే ఈ రేంజ్ కెమిస్ట్రీ ఉంటే ఫుల్ సాంగ్‌లో ఇంక ఎంత ఉంటుందోనని ఓ నెటిజన్ అన్నాడు.
కొందరు నెటిజన్లు మాత్రం నిహారికకు సపోర్ట్ చేస్తోన్నారు. నిహారికను తప్పు పట్టేంత సాంగ్‌లో ఏం లేదని అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో మద్రాస్‌కారణ్ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో కలైయరాసన్, ఐశ్వర్యదత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
విజయ్ సేతుపతి హీరోగా...
మద్రాస్‌కారణ్ కంటే ముందు తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఒరు నళ్లనాళ్ పాథు సోల్రెన్ మూవీలో నిహారిక నటించింది. 2018లో ఈ మూవీ రిలీజైంది.
వాట్ ది ఫిష్...
ప్రస్తుతం తెలుగులో వాట్ ది ఫిష్ మూవీలో నిహారిక హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. గత ఏడాది డెడ్ పిక్సెల్స్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇటీవల సోనీ లివ్ ఓటీటీలో రిలీజైన బెంచ్ లైఫ్ వెబ్‌సిరీస్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించింది. ఈ వెబ్‌సిరీస్‌ను నిహారికనే ప్రొడ్యూస్ చేసింది.