Balakrishna: అప్పుడు రవితేజ, ఇప్పుడు బాలకృష్ణ- దబిడి దిబిడిపై ట్రోలింగ్- కూతురులాంటి వాళ్లతో అసభ్యకర స్టెప్పులేంటీ అంటూ!
Trolling On Balakrishna Daaku Maharaaj Dabidi Dibidi Song: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్ నడుస్తోంది. కూతురు లాంటి అమ్మాయితో ఆ స్టెప్పులేంటీ అంటూ మండిపడుతున్నారు. అప్పుడు రవితేజను, ఇప్పుడు బాలకృష్ణ ఒకేలా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
Trolling On Balakrishna Daaku Maharaaj Dabidi Dibidi Song: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.
బాలకృష్ణ స్టెప్పులు
ఇదిలా ఉంటే, ఇటీవల డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో బాలకృష్ణతోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెలా స్టెప్పులేసింది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే, ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అందుకు కారణం సాంగ్‌లో బాలకృష్ణ వేసిన స్టెప్పులే.
ఈ సాంగ్ వీడియో బ్లూ షర్ట్, నీలం జాకెట్, బ్రౌన్ ప్యాంట్, సన్ గ్లాసెస్ ధరించి రాజులా కూర్చొన్న బాలకృష్ణతో స్టార్ట్ అవుతుంది. ఇక ఊర్వశి రౌతేలా క్రాప్ టాప్, స్కర్ట్ ధరించి ఉంటుంది. అయితే, ఊర్వశి రౌతెలా నడుముపై నుంచి బాలకృష్ణ బీట్‌కు తగినట్లు కొడుతున్నట్లుగా స్టెప్ ఉంది. ఇది చాలా అభ్యంతరకరంగా, అశ్లీలంగా ఉందని నెటిజన్స్ మండిపతున్నారు.
అసభ్యకరంగా డ్యాన్స్
అంతేకాకుండా, తర్వాత ఊర్వశిని వెనుక వైపు నుంచి బాలకృష్ణ కొడుతున్నట్లుగా (స్పాంక్) డ్యాన్స్ స్టెప్ ఉంది. ఈ రెండు స్టెప్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఆ స్టెప్స్ మరి అసభ్యకరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అలా కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు.
30 ఏళ్ల ఊర్వశితో 64 ఏళ్ల బాలకృష్ణ వేసే ఆ స్టెప్పులేంటీ, కూతురు వయసున్న వాళ్లతో ఆ డ్యాన్సులేంటీ అని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే, మీరు హీరో మాత్రమే కాదని ఎమ్మెల్యే కూడా అని, సినిమాల్లో కూడా బాధ్యతగా నడుచుకోవాలని అంటున్నారు.
తాతయ్యతో మనవరాలి డ్యాన్స్
'యంగ్ గర్ల్ డ్యాన్స్ విత్ హిజ్ గ్రాండ్ ఫాదర్(ఓ అమ్మాయి తన తాతయ్యతో డ్యాన్స్ చేస్తుంది)' అని ఓ ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు. 'చెత్త కొరియోగ్రఫీ, ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. మీరు నిజంగా బాలకృష్ణ శ్రేయోభిలాషి అయితే, దయచేసి పాటను తొలగించి రీషూట్ చేయండి' అని ఒకరు కామెంట్ చేశారు.
'మనవరాలి పాత్ర కోసం ఎప్పుడూ నార్త్ ఇండియన్ నటీమణులను ఎంచుకోండి' అని మరకొరు కామెంట్ చేశారు. "మా 'బాంద్రా, జుహూ' దర్శకులు ఈ స్థాయిలో (పూప్ ఎమోజీ) చేయరు" అని చిత్ర నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు.
నాగవంశీకి కౌంటర్
అయితే, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ విజన్ ముంబైలోని విలాసవంతమైన ప్రాంతాలైన బాంద్రా, జుహు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యేలా తెరకెక్కిస్తున్నారని, సౌత్ ఫిల్మ్ మేకర్స్ పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా ఎలా రూపొందించాలో చూపించారని నాగవంశీ అన్న కామెంట్స్‌కు కౌంటర్‌గా ఆ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఇలాంటి ట్రోలింగ్‌ను ఇదివరకు రవితేజ ఎదుర్కొన్నాడు. మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార్ పాటలో కూడా సేమ్ ఇలాంటి స్టెప్సే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ఉంటాయి. అప్పుడు కూడా ఏజ్ గ్యాప్ విషయమై, ఆ స్టెప్పులేంటీ అంటూ ట్రోలింగ్ జరిగింది. దాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అలాంటి ట్రోలింగ్‌ను బాలకృష్ణ ఎదుర్కొంటున్నాడు.
పుష్ప 2లో కూడా
అయితే, ఈ రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్ కావడం మరింత నెగెటివిటీకి కారణమైంది. పుష్ప 2 మూవీలో కూడా ఇలాంటి అసభ్యకర స్టెప్స్ ఉన్నాయని టాక్ వినిపించింది. అయితే, భార్యాభర్తల మధ్య వచ్చే సాంగ్ కావడం, అల్లు అర్జున్, రష్మిక మందన్న ఏజ్ గ్యాప్ పెద్దగా లేకపోవడంతో అది అంతగా వైరల్ కాలేదు.