Netizens fires on Dil Raju: దిల్ రాజు‌పై నెటిజన్లు ఫైర్.. తెలుగును అవమానించారంటూ ఆగ్రహం-netizens fires on dil raju for insulting telugu language in love today titles ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Netizens Fires On Dil Raju For Insulting Telugu Language In Love Today Titles

Netizens fires on Dil Raju: దిల్ రాజు‌పై నెటిజన్లు ఫైర్.. తెలుగును అవమానించారంటూ ఆగ్రహం

Maragani Govardhan HT Telugu
Nov 26, 2022 03:59 PM IST

Netizens fires on Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. లవ్ టుడే అనే కోలీవుడ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఆయన తెలుగు భాషాను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు టైటిల్స్ విషయంలో అక్షర దోషాలు ఉండటమే ఇందుకు కారణం.

లవ్ టుడే చిత్రంలో అర్ధరహితంగా ఉన్న తెలుగు టైటిల్స్
లవ్ టుడే చిత్రంలో అర్ధరహితంగా ఉన్న తెలుగు టైటిల్స్

Netizens fires on Dil Raju: టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే.. మినిమమ్ గ్యారెంటీ అని ప్రేక్షకులు అనుకుంటారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎక్కువగా హిట్లే ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుకండా కోలీవుడ్ చిత్రాలను కూడా ఆయన తెలుగులో రిలీజ్ చేస్తూ అక్కడ కూడా సక్సెస్ అందుకుంటున్నారు. కోలీవుడ్‌లో ఇటీవలే సూపర్ హిట్టయిన లవ్ టుడే చిత్రాన్ని ఆయన తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ.. మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదే సమయంలో కొంతమంది నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే అది సినిమాపై కాదు.. దిల్ రాజుపై.

దిల్ రాజుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. లవ్ టుడే సినిమా డబ్బింగ్ అంతా బాగానే ఉన్నా.. మూవీ ప్రారంభంలో వచ్చే టైటిల్స్ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. ఇందుకు కారణం టైటిల్స్ తెలుగులో అర్ధరహితంగా ఉన్నాయి. అస్పష్టమైన తెలుగులో టైటిల్స్ ఉండటంతో నెటిజన్లు ఆగ్రహంతో ఉన్నారు. తెలుగు టెక్నికల్ టీమ్ సరిగ్గా ఎడిటింగ్ చేయలేదని, దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత నుంచి ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తడం దారుణమని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

లవ్ టుడే తెలుగు వెర్షన్‌లో అక్షరాలు సరిగ్గా లేకపోవడం, ఫాంట్ బ్రేక్ అవ్వడంతో అస్పష్టంగా కనిపించాయి. ఫలితంగా సినిమా విడుదలకు ముందు ఇలాంటివి పట్టించుకోరా అంటూ దిల్ రాజుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. నిర్మాత అజాగ్రత్త వలే ఇది జరిగిందంటూ ఆయనపై సీరియస్ అవుతున్నారు. తెలుగు విషయంలో ఇంత నిర్లక్ష్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా తెలుగు వెర్షన్ చూసిన ప్రేక్షకులు ఇదే తరహా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

డబ్బింగ్ సినిమాల్లో ఈ విధంగా తెలుగును అవమానించడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై సార్పట్టై పరంపరై చిత్రంలోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తాయి. ఆర్య నటించిన ఆ సినిమాలో అయితే తెలుగు ఎక్కడ కనిపిస్తే అక్కడ అనవాద దోషాలు స్పష్టంగా కనిపించాయి. అవి తెలుగువారికి అవమానకరంగా అనిపించాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ మార్కెట్ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్కెట్ వ్యూహాలు, ప్రణాళికలపై పెట్టిన దృష్టి తెలుగు భాషపై కూడా పెట్టాలని సగటు తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్