నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ చూశారా? ఇదో రియల్ స్టోరీ.. ఇండోపాక్ వార్ ఎలా ఉంటుందో చూస్తారా?-netflix top trending movie the diplomat review a real story based on india pakistan diplomatic war ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ చూశారా? ఇదో రియల్ స్టోరీ.. ఇండోపాక్ వార్ ఎలా ఉంటుందో చూస్తారా?

నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ చూశారా? ఇదో రియల్ స్టోరీ.. ఇండోపాక్ వార్ ఎలా ఉంటుందో చూస్తారా?

Hari Prasad S HT Telugu

నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే అడుగుపెట్టిన ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్ లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఇది ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన డిప్లమటిక్ వార్ పై తీసిన రియల్ స్టోరీ. ఐఎండీబీలో 7.3 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను చూసి తీరాల్సిందే.

నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ చూశారా? ఇదో రియల్ స్టోరీ.. ఇండోపాక్ వార్ ఎలా ఉంటుందో చూస్తారా?

ఇండియా, పాకిస్థాన్ మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో కళ్లకు కట్టిన మూవీ. 2017లో పాకిస్థాన్ లో చిక్కుకుపోయిన ఉజ్మా అహ్మద్ అనే భారత యువతిని తిరిగి ఇండియాకు పంపేందుకు అప్పటి భారత దౌత్యవేత్త జేపీ సింగ్ చేసిన సాహసాన్ని ఇందులో చూడొచ్చు.

ది డిప్లొమాట్ స్టోరీ ఇదే..

ది డిప్లొమాట్ మూవీ ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.53 కోట్లు వసూలు చేసింది. ఇదొక రియల్ స్టోరీ. 2017లో జరిగింది. మలేషియాలో ఉండే ఉజ్మా అహ్మద్ అనే ఓ భారత యువతి.. ఓ మోసపూరిత పాకిస్థానీ వలలో పడి ఎలా ఇబ్బందులు పడిందో, ఆమెను అప్పటి పాకిస్థాన్ లోని భారత దౌత్యవేత్త జేపీ సింగ్ ఎలా తిరిగి ఇండియాకు పంపించారో ఈ సినిమాలో చూపించారు దర్శకుడు శివమ్ నాయర్.

ది డిప్లొమాట్ మూవీ
ది డిప్లొమాట్ మూవీ

ఉజ్మా అహ్మద్ అనే ఆ యువతికి మొదటి పెళ్లి ద్వారా తలసేమియాతో బాధపడే కూతురు పుడుతుంది. దీంతో భర్త ఆమెను వదిలేస్తాడు. అలాంటి సమయంలో మలేషియాలో ఉండే ఆమెకు ఓ పాకిస్థానీ ట్యాక్సీ డ్రైవర్ పరిచయం అవుతాడు. క్రమంగా అతనితో పరిచయం పెరుగుతుంది. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోవడంతో అతని వలలో పడుతుంది. తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని అక్రమంగా పాకిస్థాన్ లోని ఓ మారుమూల కొండ ప్రాంతంలోని బూనర్ కు తీసుకెళ్తాడు.

అక్కడ ఆమెను చిత్రహింసలు పెడతారు. సాయం కోసం ఎంత ఎదురు చూసినా ఆమెకు నిస్సహాయురాలిగా మిగిలిపోతుంది. ఎలాగోలా మలేషియాలోని తన స్నేహితులతో మాట్లాడగా.. ఎలాగైనా అక్కడి భారత దౌత్య కార్యాలయానికి వెళ్లాలని సూచిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె అక్కడికి ఎలా వెళ్తుంది? ఆ సమయంలో డిప్లొమాట్ గా ఉన్న జేపీ సింగ్ ఆమెను ఎలా రక్షిస్తాడు? అక్కడి కోర్టులు.. భారత్, పాక్ దౌత్యం.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. పాకిస్థానీ గూండాలకు సాయం చేసే ఐఎస్ఐల బారి నుంచి ఆమెను ఎలా సురక్షితంగా ఇండియాకు పంపిస్తాడన్నదే ఈ ది డిప్లొమాట్ స్టోరీ.

ది డిప్లొమాట్.. చూసి తీరాల్సిందే..

ది డిప్లొమాట్ మూవీలో జాన్ అబ్రహం
ది డిప్లొమాట్ మూవీలో జాన్ అబ్రహం

ది డిప్లొమాట్ మూవీలో దౌత్యవేత్త జేపీ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం అద్భుతంగా నటించాడు. ఇక బాధిత ఉజ్మా అహ్మద్ పాత్రను సాదియా ఖతీబ్ పోషించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం ఎలా ఉంటుందో మనం ఈ మధ్యే చూశాం. కానీ దౌత్యపరమైన యుద్ధం ఎలా ఉంటుంది? పాకిస్థాన్ లోని మన డిప్లొమాట్లు నిత్యం ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివి? అక్కడి ఉగ్రవాదులకు ఐఎస్ఐ ఎలా సాయం చేస్తుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

ఉజ్మాను పాకిస్థాన్ నుంచి సురక్షితంగా ఇండియాకు తీసుకురావడంలో దౌత్యవేత్త జేపీ సింగ్ తోపాటు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎలాంటి పాత్ర పోషించారన్నది కూడా ఈ సినిమాలో చూపించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మొదటి నుంచీ చివరి వరకూ ఎంతో ఉత్కంఠ రేపుతుంది. క్లైమ్యాక్స్ వరకూ సీట్లకు అతుక్కుపోయి చూసేలా మూవీని తీశారు.

అందుకే థియేటర్లలోనే కాదు.. నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన వెంటనే టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. దాయాదుల మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ది డిప్లొమాట్ మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం