Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రతి వారం టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితా మారుతూ ఉంటుంది. వీటిలో లేటెస్ట్ గా అడగుపెట్టిన సినిమాలు, సిరీస్ టాప్‌లోకి దూసుకెళ్తుంటాయి. అలా తాజాగా తమిళ కామెడీ మూవీ డ్రాగన్ సినిమా జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ వెబ్ సిరీస్ లలో టాప్ లో కొనసాగుతోంది.
థియేటర్లలో మంచి విజయం సాధించిన తమిళ కామెడీ డ్రామా డ్రాగన్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. గత వారం ఈ ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే నంబర్ వన్ గా నిలిచింది. ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమాను రూ.37 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది.
అదే జోరును ఇప్పుడు ఓటీటీలోనూ కొనసాగిస్తోంది. ఇక మలయాళం థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ రెండోస్థానంలో ఉంది. ఈ ఇండస్ట్రీలో ఫిబ్రవరిలో రిలీజై హిట్ కొట్టిన ఏకైక మూవీ ఇదే. నెట్‌ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదిరస్తున్నారు. ఇక కంగనా నటించిన ఎమర్జెన్సీ మూవీ మూడోస్థానంలో కొనసాగుతోంది. టాప్ 10లో మిగిలిన స్థానాల్లో ఉన్న మూవీస్ ఏవో చూడండి.
ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ తొలి స్థానంలో ఉంది. గతంలో వచ్చిన ఖాకీ: ది బిహార్ ఛాప్టర్ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ కొత్త సిరీస్ ను తీసుకొచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ ను ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనడానికి తాజాగా వచ్చిన ఈ సిరీసే నిదర్శనమని చెప్పాలి.
రెండోస్థానంలో అడోలసెన్స్ అనే సిరీస్ ఇది. ఈ నాలుగు ఎపిసోడ్ల షార్ట్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒక్కో ఎపిసోడ్ ను ఒకే షాట్లో షూట్ చేయడం ఈ సిరీస్ ప్రత్యేకత. ఇండియాలోనూ ఈ వెబ్ సిరీస్ ను అదే స్థాయిలో ఆదరిస్తుండటంతో టాప్ ట్రెండింగ్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. టాప్ 10లో మిగిలిన స్థానాల్లో ఉన్న సిరీస్ ఏవో చూడండి.
సంబంధిత కథనం