OTT Crime Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లోకి దూసుకొచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు-netflix top 10 trending movies malayalam crime thriller officer on duty on top thandel pushpa 2 in top 10 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లోకి దూసుకొచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు

OTT Crime Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లోకి దూసుకొచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు

Hari Prasad S HT Telugu

OTT Crime Thriller: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో నంబర్ 1గా నిలిచింది. ఇక ఈ టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒక మూవీ అయితే 8 వారాలుగా టాప్ 10లోనే ఉండటం విశేషం.

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లోకి దూసుకొచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు

OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఓటీటీలో, అందులోనూ నెట్‌ఫ్లిక్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో తాజాగా వచ్చిన మలయాళం మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ నిరూపిస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ నంబర్ 1

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో తొలి స్థానంలో ఉంది. మార్చి 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజైన 27 సినిమాల్లో ఏకైక హిట్ గా నిలిచిన ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. నెట్‌ఫ్లిక్స్ లోనూ అదే జోరు చూపిస్తోంది.

ఓ చిన్న నకిలీ గొలుసు తాకట్టు కేసు ఓ అమ్మాయిల ఆత్మహత్యలకు కారణమయ్యే పెద్ద కేసును పరిష్కరించడానికి ఎలా కారణమవుతుందన్నది ఈ సినిమాలు చూడొచ్చు. కుంచకో బొబన్ నటించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఈ మధ్యకాలంలో వచ్చిన టాప్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్

ఇక నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో రెండు తెలుగు మూవీస్ కి చోటు దక్కింది. వీటిలో ఐదో స్థానంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ ఉంది. మార్చి 7న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. 3 వారాలుగా టాప్ 10లోనే కొనసాగుతోంది. అటు పుష్ప 2 మూవీ 9వ స్థానంలో ఉంది. ఈ సినిమా 8 వారాలుగా టాప్ 10లోనే ఉండటం విశేషం. ఈ సినిమా జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక టాప్ 10లో ఉన్న మిగిలిన సినిమాల విషయానికి వస్తే.. రెండో స్థానంలో తమిళ కామెడీ మూవీ డ్రాగన్ ఉంది. మూడో స్థానంలో కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, నాలుగో స్థానంలో అజయ్ దేవగన్ ఆజాద్, ఆరో స్థానంలో నాదానియా, ఏడో స్థానంలో ది ఎలక్ట్రిక్ స్టేట్, 8వ స్థానంలో విదాముయర్చి, 10వ స్థానంలో ధూమ్ ధామ్ సినిమాలు ఉన్నాయి.

టాప్ 10 ట్రెండింగ్ వెబ్ సిరీస్

ఇక నెట్‌ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఈ మధ్యే ఇందులోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో క్రైమ్ డ్రామా అడొలసెన్స్, మూడోస్థానంలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డబ్బా కార్టెల్ ఉన్నాయి.

నాలుగో స్థానంలో క్రైమ్ షో క్రైమ్ ప్యాట్రోల్: సిటీ క్రైమ్స్, ఐదో స్థానంలో వెన్ లైఫ్ గివ్స్ యు టాంగరిన్స్, ఆరోస్థానంలో ఖాకీ: ది బీహార్ చాప్టర్, ఏడో స్థానంలో స్క్విడ్ గేమ్: సీజన్ 2, 8వ స్థానంలో సకమోటో డేస్: సీజన్ 1, 9వ స్థానంలో వోల్ఫ్ కింగ్, 10వ స్థానంలో బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ ఉన్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం