నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తన తొలి తెలుగు వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు సూపర్ సుబ్బు. కొన్నాళ్ల కిందట చిన్న టీజర్ తో ఈ విషయాన్ని వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా మరోసారి స్ట్రీమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది. దీనికితోడు ఆనంద్ దేవరకొండ నటించిన తక్షకుడు (Takshakudu) మూవీ కూడా నేరుగా రాబోతోంది.
ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తమ్ముడు, నటుడు అయిన ఆనంద్ దేవరకొండ నేరుగా మరో ఓటీటీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ తీసిన డైరెక్టర్ వినోద్ అనంతోజుతోనే ఆనంద్ ఈ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీకి తక్షకుడు అనే ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మూవీని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెబుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇందులో ఆనంద్ దేవరకొండ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఓ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో ఓ మండుతున్న గన్ ను పట్టుకొని కనిపించాడు. వేటగాని చరిత్లలో జింక పిల్లలే నేరస్థులు అనే క్యాప్షన్ ఈ పోస్టర్ పై చూడొచ్చు. ఈ మూవీ టైటిల్, పోస్టర్, స్టోరీ అన్నీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇదో రివేంజ్ డ్రామాగా చెబుతున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సినిమా రానుంది. ఆనంద్, వినోద్ కాంబినేషన్ లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. గతంలోనే ఓ చిన్న టీజర్ తో ఈ సిరీస్ గురించి ఆ ఓటీటీ వెల్లడించింది. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా.. చిలక ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ కు రైట్ సబ్జెక్ట్ రాంగ్ టీచర్ అనే ట్యాగ్ లైన్ ఉండటం విశేషం. ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ లా కనిపిస్తోంది. మురళీ శర్మ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు.
తెలుగులోనే కాదు పలు తమిళ వెబ్ సిరీస్, సినిమాలను కూడా నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. వీటిలో లెగసీ అనే సిరీస్ ఉంది. ఇందులో మాధవన్, నిమిషా సజయన్ లాంటి వాళ్లు నటిస్తుండటం విశేషం. ఇదే కాకుండా #Love అనే మరో వెబ్ సిరీస్ కూడా రానుంది. దీనికి బాలాజీ మోహన్ డైరెక్టర్ కాగా.. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిలాంటి వాళ్లు నటిస్తున్నారు.
ఇక మేడిన్ కొరియా అనే తమిళ సినిమా కూడా రానుంది. రాజ్ కార్తీక్ డైరెక్ట్ చేయగా.. ప్రియాంకా మోహన్, స్క్విడ్ గేమ్ ఫేమ్ పార్క్ హి జిన్ నటిస్తుండటం విశేషం. మరొకటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. మిథున్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గోమథి శంకర్ నటించాడు.
మొత్తంగా నెట్‌ఫ్లిక్స్ ఒకే రోజు ఆరు తెలుగు, తమిళ వెబ్ సిరీస్, సినిమాలను అనౌన్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. అది కూడా రెండు భాషల్లోని ప్రముఖ నటీనటులు, డైరెక్టర్లు కావడంతో వీటి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంబంధిత కథనం