నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను బ్యాన్ చేశారన్న విషయం తెలుసా?-netflix thriller movies banned after released watch these 5 movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను బ్యాన్ చేశారన్న విషయం తెలుసా?

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను బ్యాన్ చేశారన్న విషయం తెలుసా?

Hari Prasad S HT Telugu

నెట్‌ఫ్లిక్స్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నా.. ఓ ఐదు సినిమాలను మాత్రం రిలీజ్ అయిన తర్వాత నిషేధించారన్న విషయం మీకు తెలుసా? వివిధ కారణాలతో ఈ సినిమాలను కొన్ని దేశాల్లో స్ట్రీమింగ్ చేయడం లేదు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలను బ్యాన్ చేశారన్న విషయం తెలుసా? (Getty Images via AFP)

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో దాదాపు ప్రతిరోజూ బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు రిలీజ్ అవుతుంటాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ మొదలైన తర్వాత వివాదాలు తలెత్తడంతో నిషేధించాల్సి వచ్చింది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అభ్యంతరాలు రావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ సినిమాలేవో తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్‌లోని వివాదాస్పద సినిమాలు

ఓటీటీలో ఏదైనా సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఒక లాభం ఏంటంటే.. మేకర్స్ సినిమా లేదా సిరీస్ నిడివి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఒక కథను వెబ్ సిరీస్ లో మరింత వివరంగా చూపించవచ్చు. అంతేకాకుండా సాధారణంగా సినిమాలు తీసేటప్పుడు, వాటిని రిలీజ్ చేసేటప్పుడు ఉండేటటువంటి ఎన్నో రకాల లైసెన్సులు తీసుకోవాల్సిన కష్టం కూడా ఉండదు. అయితే వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసినా వివాదాలు పెరగడం వల్ల లేదా మరేదైనా కారణం చేత మేకర్స్ వాటిని ఓటీటీలో కూడా బ్యాన్ చేయాల్సి వచ్చింది. అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ద బ్రిడ్జ్

ఈ సినిమాలో చాలా అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి. దీంతో 2015లో వచ్చిన ఈ సినిమాను న్యూజిలాండ్‌లో బ్యాన్ చేశారు. అంటే నెట్‌ఫ్లిక్స్ లో న్యూజిలాండ్ ప్రేక్షకులు ఈ మూవీని చూడలేరు. వివాదం ఎంత పెరిగిందంటే నెట్‌ఫ్లిక్స్ దీన్ని బ్యాన్ చేయక తప్పలేదు.

ఫుల్ మెటల్ జాకెట్

ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ గుట్టును బయటపెట్టే ఈ సినిమాను కూడా 2017లో రిలీజ్ చేశారు. కానీ వియత్నాం బిజినెస్ లాబీ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడంతో ఈ సినిమాను బ్యాన్ చేశారు.

నైట్ ఆఫ్ ద లివింగ్ డెడ్

ఈ సినిమాను కూడా వివాదాస్పదమైన సీన్స్ కారణంగా బ్యాన్ చేశారు. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమాను జర్మనీలో స్ట్రీమింగ్ చేయలేదు. ఎందుకంటే సినిమాలో విపరీతమైన హింస, ఇంకా ఇతర అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి. విమర్శల తర్వాత దీన్ని బ్యాన్ చేశారు.

ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్

ఈ సినిమాలో ఏసుక్రీస్తు తల్లి మేరీ శారీరక సంబంధం పెట్టుకోవడం.. సాతాను యేసును శోధించడం చూపించారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్స్ ఉండడం వల్ల చాలా మంది ఇది దైవదూషణ అని చెప్పి దీన్ని బ్యాన్ చేయించారు.

ద లాస్ట్ హ్యాంగోవర్

ఈ సినిమాలో కూడా దేవుడి గురించి చాలా అభ్యంతరకరమైన విషయాలు చూపించారు. దీంతో ఎంతో మంది మనోభావాలు దెబ్బతినడంతో దీన్ని ఓటీటీ నుండి తీసేశారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.