రామ్ చరణ్‌పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. గ్లోబల్ స్టార్‌ ఎదిగిన క్రమంపై..!-netflix planning a documentary on ram charan says a report to feature how charan became a global star ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రామ్ చరణ్‌పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. గ్లోబల్ స్టార్‌ ఎదిగిన క్రమంపై..!

రామ్ చరణ్‌పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. గ్లోబల్ స్టార్‌ ఎదిగిన క్రమంపై..!

Hari Prasad S HT Telugu

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు, తెలుగు నుంచి ప్రపంచస్థాయి వరకు ఈ స్టార్ హీరో ఎదిగిన క్రమంపై ఈ డాక్యుమెంటరీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్‌పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. గ్లోబల్ స్టార్‌ ఎదిగిన క్రమంపై..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ మరో అదిరిపోయే డాక్యుమెంటరీకి సిద్ధమవుతోంది. ఈ మధ్యే దర్శక ధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన ఆ ఓటీటీ.. ఇప్పుడు రామ్ చరణ్‌ కోసం ప్లాన్ చేస్తున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న పెద్ది మూవీ తెర వెనుక సీన్లను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ డాక్యుమెంటరీ

రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో ఎదిగిన క్రమంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోందని ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు.

మగధీరతో తన కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చరణ్.. ఆర్ఆర్ఆర్ తో ఎక్కడికో వెళ్లిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్ పై డాక్యుమెంటరీ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ ఉంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు చరణ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే రామ్ చరణ్ ఇంటి దగ్గర అభిమానుల సందడిని షూట్ చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం అతడు పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఈ డాక్యుమెంటరీలో ఈ పెద్ది మూవీ తెర వెనుక సీన్లను కూడా డాక్యుమెంటరీ చూపించబోతున్నట్లు సమాచారం.

చరణ్ కెరీర్లో మైలురాళ్లు

రామ్ చరణ్ 2007లో వచ్చిన చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే 2009లో వచ్చిన మగధీర మూవీతో అతని లెవెల్ ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పట్లో అదో ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం మూవీలో తన నటవిశ్వరూపాన్ని చరణ్ చూపించాడు.

ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలో అతనిపై రానున్న ఈ డాక్యుమెంటరీలో చరణ్ గురించి టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ముఖ్యంగా చిరంజీవితోపాటు సుకుమార్, రాజమౌళి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ డాక్యుమెంటరీలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.

అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ డాక్యుమెంటరీ నిజమైతే మాత్రం చరణ్ అభిమానులకు ఇంతకు మించిన విషయం మరొకటి ఉండదు. ఈ మధ్యే అతని మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ లోనూ ప్రతిష్టించిన విషయం తెలిసిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం