Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ 2025 ఓటీటీ రిలీజ్ సినిమాలు- ఒక్కో తెలుగు హీరోను పొగుడుతూ- కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్-netflix ott telugu movies released in 2025 like pawan kalyan og nani hit 3 naga chaitanya sai pallavi thandel mad square ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: నెట్‌ఫ్లిక్స్‌ 2025 ఓటీటీ రిలీజ్ సినిమాలు- ఒక్కో తెలుగు హీరోను పొగుడుతూ- కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ 2025 ఓటీటీ రిలీజ్ సినిమాలు- ఒక్కో తెలుగు హీరోను పొగుడుతూ- కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 16, 2025 11:59 AM IST

Netflix Pandaga OTT Telugu Movies Releases In 2025: ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంచలన ప్రకటన చేసింది. 2025 సంవత్సరంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అన్ని తెలుగు సినిమాలను అనౌన్స్ చేసేసింది. అది కూడా ఒక్కో తెలుగు స్టార్ హీరో గురించి పొగుడుతూ మరి అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్.

నెట్‌ఫ్లిక్స్‌లో 2025 ఓటీటీ రిలీజ్ తెలుగు సినిమాలు ఇవే!
నెట్‌ఫ్లిక్స్‌లో 2025 ఓటీటీ రిలీజ్ తెలుగు సినిమాలు ఇవే!

Netflix OTT Telugu Movies In 2025: వరల్డ్ వైడ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తెలుగు సినిమాలను కూడా ఎక్కువగానే రిలీజ్ చేస్తుంటుంది. 2024లో దేవర పార్ట్ 1, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సలార్‌తో పాటు అనేక పాపులర్ చిత్రాతో సందడి చేసిన నెట్‌ఫ్లిక్స్ తన అప్ కమింగ్ తెలుగు చిత్రాల రిలీజ్‌ను ప్రకటించేసింది.

yearly horoscope entry point

తెలుగు సినిమా గొప్పతనాన్ని

2025 సంవత్సరంలో ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలను చెప్పుకొచ్చింది. ఇవి 2025లో థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయి. తెలుగు పరిశ్రమలోని కొంతమంది అత్యుత్తమ హీరోలు, కథలు, పెర్ఫార్మెన్స్‍లతో ఈ చిత్రాలు తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తీసుకువస్తాయని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇస్తోంది.

థియేటర్‌కి వచ్చిన తర్వాత ఈ టైటిల్స్ ప్రేక్షకులకు కథలో లీనమయ్యే అనుభవాన్ని అందిస్తాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ యాక్టింగ్‌ను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆస్వాదిస్తారు. నందమూరి బాలకృష్ణ స్టయిల్‌ని ఆనందిస్తారు. నానిని అడ్మైర్ చేస్తారు. విజయ్ దేవరకొండ చరిష్మాను, నాగ చైతన్య చరిష్మాని కొనియాడుతారు. మాస్ మహారాజా రవితేజను మాస్‌ని ఎంజాయ్ చేస్తారు.

గతంలో కంటే

నెట్‌ఫ్లిక్స్ ఆడియెన్స్ ఇంట్లో ఈ ప్రతి స్టార్‌ను చూస్తూ గతంలో కంటే దగ్గరిగా భావిస్తారు. సాయి పల్లవి ప్రతిభ, ప్రియాంక మోహన్, మీనాక్షి చౌదరి ఎలిగెన్స్ ప్రేక్షకులకు మరపురానిదిగా చేస్తాయి అంటూ నెట్‌ఫ్లిక్స్ తమ 2025 ఓటీటీ రిలీజ్ తెలుగు సినిమాల జాబితాను అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ "2024 నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు అద్భుతమైన సంవత్సరం. ఎందుకంటే మన తెలుగు సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా హృదయాలను గెలుచుకున్నాయి" అని అన్నారు.

అగ్రస్థానంలో

"దేవర, గుంటూరు కారం, హాయ్ నాన్న, లక్కీ భాస్కర్, సలార్, సరిపోదా శనివారం వంటి బ్లాక్‌బస్టర్‌లు ప్రపంచవ్యాప్తంగా లవబుల్‌గా మారాయి. వాచ్‌లిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులు, విమర్శకుల నుంచి ప్రేమను సంపాదించాయి" అని మోనికా షెర్గిల్ తెలిపారు.

"మనం 2025లోకి అడుగుపెడుతున్నప్పుడు ఉత్సాహం మరింత పెరుగుతూనే ఉంది. పరిశ్రమలోని ప్రముఖ నటులు, కథలతో కూడిన స్లేట్‌తో ఎదురుచూడటానికి చాలా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ, హిట్ 3 - ది థర్డ్ కేస్ నుంచి యాక్షన్-ప్యాక్డ్ వీడీ 12 వరకు.. ఈ సంవత్సరం మరపురాని కథలు, భావోద్వేగాలు, అద్భుతమైన సినిమాలను అందించనుందని మీకు హామీ ఇస్తుంది" అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు.

2025లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తెలుగు రిలీజ్ సినిమాలు ఇవే!

1ఓజీ (పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్)- తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్

2. అనగనగా ఒక రాజు (నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి)- తమిళం, మలయాళం, కన్నడ

3. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ (Court: State vs A Nobody) (ప్రియదర్శి, శివాజీ)- తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

4. జాక్ (సిద్ధు జొన్నలగడ్డ)- తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

5. మ్యాడ్ స్క్వేర్ (సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్)- తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

6. మాస్ జాతర (రవితేజ)- తమిళం, మలయాళం, కన్నడ

7. తండేల్ (నాగ చైతన్య, సాయి పల్లవి)- తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

8. విజయ్ దేవరకొండ 12 (విజయ్ దేవరకొండ)- తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

9. హిట్ 3- ది థర్డ్ కేస్ (నాని)- తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

ఇలా 2025 ఓటీటీ తెలుగు సినిమాలను ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్. వీటిలో తెలుగు నుంచి ఇంకా థియేటర్లలో విడుదల కానీ, తొమ్మిది సినిమాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం