Netflix OTT: ప్లాన్‍ల సబ్‍స్క్రిప్షన్ ధరలను పెంచిన నెట్‍ఫ్లిక్స్.. కానీ!-netflix ott platform hikes subscription plans prices but no effect on indian users know the details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: ప్లాన్‍ల సబ్‍స్క్రిప్షన్ ధరలను పెంచిన నెట్‍ఫ్లిక్స్.. కానీ!

Netflix OTT: ప్లాన్‍ల సబ్‍స్క్రిప్షన్ ధరలను పెంచిన నెట్‍ఫ్లిక్స్.. కానీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 22, 2025 02:57 PM IST

Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్లాన్‍ల ధరలను పెంచింది. కొన్ని దేశాల్లో రేట్లను అధికం చేసింది. ఇండియాలో ప్లాన్‍ల పరిస్థితి ఏంటో ఇక్కడ చూడండి.

Netflix OTT: ప్లాన్‍ల సబ్‍స్క్రిప్షన్ ధరలను పెంచిన నెట్‍ఫ్లిక్స్.. కానీ!
Netflix OTT: ప్లాన్‍ల సబ్‍స్క్రిప్షన్ ధరలను పెంచిన నెట్‍ఫ్లిక్స్.. కానీ!

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్. వరల్డ్ వైడ్‍గా అత్యధిక సబ్‍స్క్రైబర్లు ఉన్న ప్లాట్‍ఫామ్ ఇదే. ఆ రేంజ్‍లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కంటెంట్ వస్తూ ఉంటుంది. కాగా, తాజాగా సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍ల ధరను నెట్‍ఫ్లిక్స్ పెంచేసింది. కొన్ని దేశాల్లో ప్లాన్‍లు కాస్త ఇంకా కాస్త ఖరీదయ్యాయి. ఆ వివరాలు ఇవే..

ఈ దేశాల్లో పెంపు.. ఎంతంటే..

నెట్‍ఫ్లిక్స్ కొన్ని దేశాల్లో ధరలను పెంచింది. అమెరికా, అర్జెంటీనా, కెనడా, పోర్చుగల్ దేశాల్లో ప్లాన్‍ల రేట్లను అధికం చేసింది. అమెరికాలో ప్రీమియమ్, స్టాండర్డ్ మెంబర్షిప్ ప్లాన్‍ల ధరను 2 డాలర్ల మేర పెంచింది నెట్‍ఫ్లిక్స్. దీంతో ప్రీమియమ్ ప్లాన్ ధర నెలకు 25 డాలర్లు, స్టాండర్డ్ ప్లాన్ రేటు 18 డాలర్లకు చేరింది. యాడ్ సపోర్టెడ్ ప్లాన్ ధరను ఓ డాలర్ పెంచగా.. అది 8 డాలర్లకు చేరింది.

ఇండియాలో నో ఛేంజ్

ఈ పెంపును ప్రస్తుతం కొన్ని దేశాలకే నెట్‍ఫ్లిక్స్ పరిమితం చేసింది. భారత్‍లో ప్రస్తుతానికి ప్లాన్‍ల రేట్లను పెంచలేదు. ఇప్పటికి ఉన్న ధరలనే కొనసాగించింది. మరి భవిష్యత్తులో ఏమైనా ఇండియాలోనూ రేట్లు పెంచుతుందేమో చూడాలి.

ఇండియా ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ప్లాన్‍ల ధరలు ఇలా..

2021 డిసెంబర్‌లో ఇండియాలో ప్లాన్‍ల ధరలను నెట్‍ఫ్లిక్స్ తగ్గించింది. సబ్‍స్క్రిప్షన్ బేస్ పెంచుకునేందుకు అప్పట్లో ఆ స్టెప్ వేసింది. అప్పటి నుంచి భారత్‍లో మార్చలేదు. ప్రస్తుతం ఇండియాలో నెట్‍ఫ్లిక్స్ నెలవారి ప్లాన్‍ల ధరలు ఎలా ఉన్నాంటే..

నెట్‍ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ - రూ.149 - ఒక డివైజ్

నెట్‍ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ - రూ.199 - ఒక డివైజ్

నెట్‍ఫ్లిక్స్ స్టాండర్డ్ - రూ.499 - రెండు డివైజ్‍లు

నెట్‍ఫ్లిక్స్ ప్రీమియం - రూ.649 - నాలుగు డివైజ్‍లు

స్క్విడ్ గేమ్ 2 సూపర్ సక్సెస్

స్క్విడ్ గేమ్ 2 వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. 2021లో వచ్చిన ఫస్ట్ సీజన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కాగా.. గత నెల 2024 డిసెంబర్ 26న వచ్చిన రెండో సీజన్ అదే రేంజ్‍లో దూసుకెళుతోంది. తొలి వారంలో 92 దేశాల్లో టాప్ ట్రెండింగ్‍లో నిలిచి స్క్విడ్ గేమ్ 2 సిరీస్ భారీ సక్సెస్ అయింది. ఇంకా చాలా దేశాల్లో ట్రెండింగ్‍లోనే ఉంది. తాజాగా నెట్‍ఫ్లిక్స్ సబ్‍స్క్రిప్షన్ బేస్ పెరిగేందుకు ఈ రెండో సీజన్ తోడ్పడింది. స్క్విడ్ గేమ్ 2 సిరీస్‍లో లీజంగ్ జీ, లీ బ్యుంగ్ హన్, ఇమ్ సివాన్, లీ సియోహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. హ్యాంగ్ డోంగ్ హుక్ ఈ సిరీస్‍కు షోరన్నర్‌గా ఉన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం