ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రారాజుగా పేరొందింది నెట్‌ఫ్లిక్స్. ఎన్నో రకాల కంటెంట్‌ను అందిస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కంటెంట్ చూస్తున్న యూజర్స్‌కు అంతరాయం కలిగింది.
యూనిటైడ్ స్టేట్స్ అంతటా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సేవలు నిలిచిపోయాయి. మే 29న సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్న సమయంలో కంటెంట్ యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది.
"ఈ శీర్షిక తక్షణమే చూడటానికి అందుబాటులో లేదు" అంటూ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎర్రర్ చూపించింది. దాంతో రాత్రి 9:40 గంటల సమయంలో 75, 000 మందికి పైగా వినియోగదారుల ఫిర్యాదులు నమోదైనట్లు నెట్‌ఫ్లిక్స్ అవుట్‌టేజ్-ట్రాకింగ్ సైట్ డౌన్ డిటెక్టర్ ద్వారా తెలిసిందట. "ఈ శీర్షికను చూసేందుకు అందుబాటులో లేదు. దయచేసి మరో శీర్షికను ప్రయత్నించండి" అంటూ మెసేజ్ వచ్చిందని సమాచారం.
ఈ విషయం గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ పలు రకాల ట్వీట్స్, కామెంట్స్‌తో తెలిపారు. "ఎర్రర్ మెసేజ్ వచ్చింది 'ఈ శీర్షిక తక్షణమే చూడటానికి అందుబాటులో లేదు. దయచేసి మరో శీర్షికను ప్రయత్నించండి'. చూడటానికి ఏదైనా ఎంచుకునేటప్పుడు ఇది జరుగుతుంది" అని వచ్చినట్లు ఒకరు తెలిపారు.
మరొకరు "నెట్‌ఫ్లిక్స్ క్రాష్ అయింది. యానిమేషన్ చూస్తున్న నాకు కోపం వచ్చింది. ఏ పరికరంలోనూ పని చేయదు" అని రాసుకొచ్చారు. "నా అన్ని పరికరాలలో నేను ప్లే చేసే దేనికైనా 'ఈ శీర్షిక తక్షణమే చూడటానికి అందుబాటులో లేదు' అని మరొకరు చెప్పారు.
"నేను ఒకసారి ఏదైనా చూడాలనుకున్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ డౌన్ అవుతుంది" అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మరొకరు మరింత వివరణాత్మక పోస్ట్‌తో తమ నిరాశను వ్యక్తం చేశారు. "డిపార్ట్‌మెంట్ క్యూ ఎపిసోడ్ 5 చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కంటిన్యూ వాచింగ్, మై లిస్ట్, కొత్త షోలు మొదలైనవన్నీ క్లోజ్ అయిపోయాయి. నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైందో ప్లీజ్ వివరించండి. గంట గడిచినా ఇంకా ఏమీ కాలేదు. రేపటిలోగా అయినా సరిచేయండి థాంక్యూ" అని రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మే 29 నేచురల్ స్టార్ నాని క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌లో సల్మాన్ ఖాన్ సికందర్, డిపార్ట్‌మెంట్ క్యూ తదితర కొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ఇక ఇవాళ్టీ (మే 30) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సూర్య, పూజా హెగ్డే రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ డౌన్ అయిన నేపథ్యంలో హిట్ 3, సికందర్, రెట్రో మూవీలను యూనిటెడ్ స్టేట్స్‌లో వీక్షించడం కష్టంగా మారనుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం