Netflix Most Watched: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ నెల రెండో వారంలో అడుగుపెట్టిన ఓ నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. ఒక్కో ఎపిసోడ్ ను కేవలం ఒకే షాట్ లో షూట్ చేయడం ఈ షో స్పెషాలిటీ. తొలి రోజు నుంచే వస్తున్న పాజిటివ్ రివ్యూలతో అడొలసెన్స్ (Adolescence) అనే వెబ్ సిరీస్ కు 11 రోజుల్లోనే ఏకంగా 66.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ అడొలసెన్స్ వెబ్ సిరీస్ మార్చి 13న అడుగుపెట్టింది. కేవలం నాలుగు ఎపిసోడ్లతోనే ఈ సిరీస్ వచ్చింది. వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. స్టీఫెన్ గ్రాహమ్, ఓవెన్ కూపర్, ఎరిన్ డోహర్తీ నటించిన ఈ సిరీస్ లోకి ఒక్కో ఎపిసోడ్ ను ఒకే షాట్ లో చిత్రీకరించడం విశేషం.
వెరైటీ మ్యాగజైన్ ప్రకారం.. అడొలసెన్స్ వెబ్ సిరీస్ కు తొలి వారమే 24.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక రెండో వారం మరో 42 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అంటే తొలి 11 రోజుల్లోనే ఏకంగా 66.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన షోగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సిరీస్ తర్వాత ది రెసిడెన్స్ 6.4 మిలియన్ల వ్యూస్, రన్నింగ్ పాయింట్ 3.5 మిలియన్ల వ్యూస్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అడొలసెన్స్ వెబ్ సిరీస్ లో కేవలం నాలుగే ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ఒక ఎపిసోడ్ మొత్తాన్ని సింగిల్ టేక్ లోనే షూట్ చేయడం విశేషం. అంటే సిరీస్ మొత్తం ఎలాంటి కట్స్, ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో అలా సాగుతూ వెళ్తుంది. ఈ ప్రత్యేకతతోనే అడొలసెన్స్ వెబ్ సిరీస్ ను చూసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఈ సిరీస్ ఓ 13 ఏళ్ల స్టూడెంట్ జేమీ మిల్లర్ (ఓవెన్ కూపర్) చుట్టూ తిరుగుతుంది. అతడు తన క్లాస్‌మేట్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అవుతాడు. తాను ఏ నేరం చేయలేదని అతడు వాదిస్తాడు. కానీ సాక్ష్యాధారాలు మాత్రం అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.
మిగిలిన వెబ్ సిరీస్ లకు భిన్నంగా ఇది కేవలం నాలుగు ఎపిసోడ్లతోనే వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ ను ఒకే షాట్ లో తీయడం అంటే మాటలు కాదు. అందులోని నటీనటులంతా దీనికి తగినట్లుగా అద్భుతంగా నటించారు. ఈ సిరీస్ లో కెమెరా ఎప్పుడూ ప్రతి పాత్రనూ ఫాలో అవుతూనే ఉంటుంది.
సంబంధిత కథనం