నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఏప్రిల్ రౌండప్: నిరాశపరిచిన రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమాలు.. అదరగొట్టిన తెలుగు చిత్రం-netflix india ott roundup originals test and jewel thief disappoints and court perusu and chhaava success ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఏప్రిల్ రౌండప్: నిరాశపరిచిన రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమాలు.. అదరగొట్టిన తెలుగు చిత్రం

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఏప్రిల్ రౌండప్: నిరాశపరిచిన రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమాలు.. అదరగొట్టిన తెలుగు చిత్రం

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు చిత్రాలు నిరాశపరిచాయి. అయితే, ఓ తెలుగు చిత్రం అంచనాలను మించి అదరగొట్టింది. ఓ తమిళ మూవీకి కూడా వ్యూస్‍లో దుమ్మురేపింది.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఏప్రిల్ రౌండప్: నిరాశపరిచిన రెండు డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమాలు.. అదరగొట్టిన తెలుగు చిత్రం

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్‍లో చాలా సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. రెండు చిత్రాలను ఇదే నెలలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది నెట్‍ఫ్లిక్స్ ఇండియా. అయితే, ఈ రెండు అనుకున్న రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయాయి. కంటెంట్ పరంగానూ ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. అయితే, ఓ తెలుగు మూవీ, తమిళ చిత్రం దుమ్మురేపాయి. ఛావా చిత్రం కూడా అదరగొట్టింది. నెట్‍ఫ్లిక్స్ ఏప్రిల్ రౌండప్ ఇక్కడ చూడండి.

నిరాశపరిచిన టెస్ట్, జువెల్ తీఫ్

టెస్ట్ సినిమాను ఈనెల ఏప్రిల్ 4వ తేదీన డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది నెట్‍ఫ్లిక్స్. ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్ లాంటి స్టార్ యాక్టర్లు ఉండటంతో మంచి బజ్ నెలకొంది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. స్టోరీ స్ట్రాంగ్‍గా లేకపోవటం, కథనం కూడా మరీ ఆసక్తిగా లేకపోవటంతో అనుకున్న రేంజ్‍లో వ్యూస్ దక్కలేదు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ టెస్ట్ వచ్చింది. డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమానే అయినా వారం కూడా ట్రెండింగ్‍లో టాప్‍లో ఉండలేకపోయింది ఈ చిత్రం. అనుకున్న స్థాయిలో వ్యూస్ దక్కించుకోలేకపోయింది. ఈ మూవీకి శశికాంత్ దర్శకత్వం వహించారు.

సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రలు పోషించిన జువెల్ తీఫ్ సినిమా ఏప్రిల్ 25న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఇది కూడా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ హిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదనే కామెంట్లు ప్రేక్షకుల నుంచి వచ్చాయి. దీంతో అనుకున్న రేంజ్‍లో వ్యూస్ రావడం లేదు. ప్రస్తుతానికి టాప్ ట్రెండింగ్‍లో ఉన్నా ఆ ప్లేస్‍లో ఎక్కువ రోజులు ఉండడం కష్టమే.

దుమ్మురేపిన తెలుగు, తమిళ చిత్రాలు

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్‍తో తెలుగు సినిమా ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ సినిమా అంచనాలకు మించి అదరగొట్టింది. ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవీ, శివాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా భారీ వ్యూస్ దక్కించుకుంది. నేషనల్ రేంజ్‍లో పాపులర్ అయింది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ చిత్రం ఓటీటీలోనూ సత్తాచాటింది. ఏప్రిల్ 11న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది కోర్ట్. మరో తెలుగు మూవీ మ్యాడ్ స్క్వేర్ కూడా నెట్‍ఫ్లిక్స్‌లో సత్తాచాటుతోంది. ఏప్రిల్ 25న స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ లోబడ్జెట్ కామెడీ చిత్రం నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో ప్రస్తుత రెండో ప్లేస్‍కు వచ్చింది.

తమిళ కామెడీ మూవీ ‘పెరుసు’ కూడా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సర్‌ప్రైజ్ చేసింది. థియేటర్లలో మోస్తరుగా ఆడిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం నేషనల్ వైడ్‍గా పాపులర్ కావటంతో పాటు మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. వైభవ్, సునీల్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 11న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

ఛావా కూడా..

ఛావా చిత్రం ఈనెల నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా లీడ్ రోల్స్ చేసిన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ రూ.800కోట్లకుపైగా కలెక్షన్లతో థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రం ఏప్రిల్ 11న నెట్‍ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టి అనుకున్న విధంగా మంచి వ్యూస్‍తో ముందుకు సాగుతోంది. ఇలా, ఆశలు పెట్టుకున్న డైరెక్ట్ స్ట్రీమింగ్ చిత్రాలు నిరాశ మిగిల్చినా.. వేరే చిత్రాలు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీని ఏప్రిల్‍లో సేవ్ చేశాయి. మిగిలిన కొన్ని సినిమా మోస్తరుగా పర్ఫార్మ్ చేస్తున్నాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం