Kaala Paani OTT Release Date: కాలా పానీ.. అండమాన్ జైలు కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్
Kaala Paani OTT Release Date: ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎలా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వారం థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు ఓటీటీల్లో నేరుగా మూవీస్, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. అలా త్వరలో సరికొత్త కథాంశంతో కాలా పానీ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులు ముందుకు రానుంది.
Kaala Paani In Netflix OTT Release Date: ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. సినీ ప్రియులే కాకుండా సగటు ప్రేక్షకుడు సైతం డిజిటల్ ప్లాట్‍ఫామ్స్ కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. థియేటర్లలో మంచి హిట్ టాక్ వస్తేనే సినిమాలను చూస్తున్న ఆడియెన్స్.. ఓటీటీల్లో ఎప్పుడెప్పుడూ డిఫరెంట్ కంటెంట్ మూవీస్, వెబ్ సిరీసులు వస్తున్నాయా అని చెక్ చేసుకుంటున్నారు. ఇక వారి అభిరుచికి తగినట్లుగా సినిమాలు, సిరీసులను నిర్మిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నెట్‍ఫ్లిక్స్.
నెట్‍ఫ్లిక్స్ ఒరిజనల్స్ పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలను, వెబ్ సిరీసులను రూపొందిస్తోంది. ఇలా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ వేదికగా సేక్రెడ్ గేమ్స్, ఢిల్లీ క్రైమ్స్, మనీ హైస్ట్, యూ సిరీస్, గన్స్ అండ్ గులాబ్స్, లిటిల్ థింక్స్, సెక్స్ ఎడ్యుకేషన్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్, రానా నాయుడు వంటి సిరీసులను ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‍తో రానుంది నెట్‍ఫ్లిక్స్ ఇండియా. త్వరలో నెట్‍ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ కాలా పానీ.
అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యూలర్ జైలు చుట్టు జరిగే కథాంశంతో తెరకెక్కింది కాలా పానీ వెబ్ సిరీస్. సస్పెన్స్ థ్రిల్లర్‍గా రూపొందిన ఈ సిరీస్‍ను పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్‍పై బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. కాలా పానీకి సమీర్ సక్సెనా, అమిత్ గోలాని దర్శకత్వం వహించారు. కాలా పానీ వెబ్ సిరీస్ అక్టోబర్ 18 నుంచి నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‍ఫ్లిక్ల్ ఇండియా.
కాగా కాలా పానీ వెబ్ సిరీసులో బాలీవుడ్ నటి మోనా సింగ్, అశుతోష్ గోవారికర్, అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిక ఇంద్రజిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కాలా పానీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. మరి చూడాలి సిరీస్ రిలీజ్ తర్వాత ఎంతమేరకు సక్సెస్ అవుతుందో.