Netflix crime thriller web series: నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది..
Netflix crime thriller web series: నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటైన కోహ్రాకు ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్ట్ 27) సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
Netflix crime thriller web series: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుంది. ఈ జానర్ సిరీస్ లను నిర్మించడంలో మిగిలిన ఓటీటీల కంటే నెట్‌ఫ్లిక్స్ ఓ అడుగు ముందే ఉంటుంది. అలా క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన మరో వెబ్ సిరీస్ కోహ్రా(Kohrra). గతేడాది వచ్చిన తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి రెండో సీజన్ ను అనౌన్స్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ లో గతేడాది జులైలో కోహ్రా తొలి సీజన్ స్ట్రీమింగ్ అయింది. పంజాబ్ లోని ఓ సంపన్న కుటుంబంలో జరిగిన హత్య చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఆ హత్య కేసు విచారిస్తున్న పోలీసులకు ఆ కుటుంబంలోని సంక్లిష్ట సంబంధాల గురించి కూడా తెలుస్తుంది. నిజానికి కోహ్రా అంటే పొగ మంచు అని అర్థం. పంజాబ్ వాతావారణం చాలా వరకు ఇలాగే ఉంటుంది.
ఆ పొగ మంచు వెనుకాల మసకమసకగా కనిపించే వాటిలాగే ఈ కోహ్రా వెబ్ సిరీస్ లోని సంపన్న కుటుంబంలోని బంధాలు, వాళ్ల మధ్య రహస్యాలు కూడా తెలుస్తూ ఉంటాయి. తొలి సీజన్ లాగే ఈ రెండో సీజన్ లోనూ పోలీసుల దర్యాప్తు మరో హత్య, మరో కుటుంబంలోని రహస్యాలను ఛేదిస్తూ సాగనుంది.
కోహ్రా రెండో సీజన్
కోహ్రా వెబ్ సిరీస్ లో బరుణ్ సోబ్టీ, మోనా సింగ్ లాంటి వాళ్లు నటించారు. ఇదొక పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. కొత్త సీజన్ లోనూ సుదీప్ శర్మ దర్శకత్వం వహించాడు. అతనితోపాటు ఫైజల్ రెహమాన్ నిర్మించారు. యాక్ట్ త్రీ ప్రొడక్షన్స్, ఫిల్మ్ స్క్వాడ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సిరీస్ నిర్మిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెండో సీజన్లోనూ బరుణ్ సోబ్టి ఓ యువ పోలీస్ ఆఫీసర్ గరుండి పాత్రలో కనిపించనున్నాడు. అయితే రెండో సీజన్లో మోనా సింగ్ పాత్ర ఏంటన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఈ కోహ్రా రెండో సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందన్న విషయం మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఇంకా వెల్లడించలేదు.
నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటికే ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ క్రైమ్, కిల్లర్ సూప్, ట్రయల్ బై ఫైర్, జాంతారా, గన్స్ అండ్ గులాబ్స్, స్కూప్, షి, రానా నాయుడు, ఆర్యనాక్, సేక్రెడ్ గేమ్స్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. వీటిలో కొన్ని తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి.