OTT Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఆ రోజు నుంచే-netflix crime thriller web series dabba cartel trailer released to stream from 28th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఆ రోజు నుంచే

OTT Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఆ రోజు నుంచే

Hari Prasad S HT Telugu
Published Feb 18, 2025 04:07 PM IST

OTT Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. తమిళ హీరోయిన్ జ్యోతిక, అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే, షబానా అజ్మీలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 18) రిలీజైంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఆ రోజు నుంచే
నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఆ రోజు నుంచే

OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ఓటీటీ పెట్టింది పేరు. అందులో నెట్‌ఫ్లిక్స్ లో ఇలాంటివే ఎక్కువ. ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ లోకే డబ్బా కార్టెల్ (Dabba Cartel) పేరుతో మరో వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 18) రిలీజ్ కాగా.. వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నటీనటులు షబానా అజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, గజరాజ్ రావ్ లాంటి వాళ్లు నటించిన సిరీస్ ఇది. డబ్బాల్లో లంచ్ తోపాటు డ్రగ్స్ కూడా సప్లై చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ వాళ్ల అక్రమ దందా, అందులో ఇరుక్కుపోయి అటు డ్రగ్స్ మాఫియా, ఇటు పోలీసుల చేతుల్లో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారన్నది ఈ ట్రైలర్లో చూపించారు.

ముంబై శివార్లలోనే థానే బ్యాక్‌డ్రాప్ లో ఈ డబ్బా కార్టెల్ స్టోరీ నడుస్తుంది. ముంబైలో డబ్బా వాలాల బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఆ డబ్బాల వెనుక డ్రగ్స్ అనే చీకటి దందాను నడిపించే గృహిణిలు గురించి ఈ డబ్బా కార్టెల్ చూపించబోతోంది.

డబ్బా కార్టెల్ ఓటీటీ రిలీజ్ డేట్

ఎంతో ఆసక్తి రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. “వాళ్లు వండుతున్నారు. అది క్రిమినల్లీ గుడ్. డబ్బా కార్టెల్ ను ఫిబ్రవరి 28 నుంచి చూడండి” అనే క్యాప్షన్ తో తన ఇన్‌స్టాగ్రామ్ లో నెట్‌ఫ్లిక్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది.

ఈ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ను హితేష్ భాటియా డైరెక్ట్ చేశాడు. జ్యోతిక, షబానా అజ్మీ, షాలినీ పాండేలాంటి వాళ్లు నటించడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ ముంబై, డ్రగ్స్ కథాంశంతో వస్తుండటంతో డబ్బా కార్టెల్ ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం