Netflix Crime Thriller: తమన్నా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్.. ఎప్పుడంటే..
Netflix Crime Thriller: తమన్నా నటిస్తున్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే రాబోతోంది. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బిహైండ్ ద సీన్స్ వీడియోను నెట్‌ఫ్లిక్స్ బుధవారం (అక్టోబర్ 23) రిలీజ్ చేసింది.
Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రూ.60 కోట్ల విలువైన వజ్రం చోరీ చుట్టూ తిరిగే కథతో వస్తున్న ఈ సినిమాలో తమన్నాతోపాటు జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అనౌన్స్ చేయనుంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
సికందర్ కా ముకద్దర్ ఓటీటీ స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు సికందర్ కా ముకద్దర్. ఈ సినిమాకు సంబంధించి బిహైండ్ ద సీన్స్ క్లిప్స్ తో ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. మూవీ గురించి వెల్లడించింది. తమన్నా, జిమ్మీ షెర్గిల్ లాంటి వాళ్లు ఇందులో నటిస్తున్నారు. ఈ వీడియోలో లీడ్ రోల్స్ పోషిస్తున్న నటులు కెమెరా ముందు ఎలా నటిస్తున్నారో చూడొచ్చు.
"60 కోట్ల విలువైన వజ్రం చోరీ.. ఓ సుదీర్ఘ వెతుకులాట.. ఓటమిని అంగీకరించని ఓ ఇన్‌స్పెక్టర్.. సికందర్ కా ముకద్దర్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని సదరు ఓటీటీ త్వరలోనే అనౌన్స్ చేయనుంది.
సికందర్ కా ముకద్దర్ మూవీ గురించి..
కొంతకాలంగా ఓటీటీలపై దృష్టి సారించిన తమన్నా భాటియా మరోసారి నేరుగా డిజిటల్ ప్రీమియర్ కే సిద్ధమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సికందర్ కా ముకద్దర్ మూవీని ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో చాలా ఇంటెన్స్ గా సాగింది. రూ.60 కోట్ల వజ్రం కనిపించకుండా పోయిందంటూ.. ఈ మూవీ ప్లాట్ ఏంటన్నది నెట్‌ఫ్లిక్స్ చెప్పేసింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సికందర్ కా ముకద్దర్ మరో ఇంట్రెస్టింగ్ వాచ్ కానుంది.
ఈ వీడియో రిలీజ్ కాగానే డైరెక్టర్ నీరజ్ పాండే అభిమానులు కామెంట్ వర్షం కురిపించారు. నీరజ్ పాండే ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి రావాలని ఒకరు.. బెస్ట్ స్పై సినిమాల డైరెక్టర్ నీరజ్ పాండే అని మరొకరు కామెంట్స్ చేశారు.
నీరజ్ పాండే ఈ మధ్యే అజయ్ దేవగన్, టబు నటించిన ఔరో మే కహా దమ్ థా మూవీని డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అటు తమన్నా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిందీ మూవీ స్త్రీ2లో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే.