OTT Comedy Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ కామెడీ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ట్విస్టులు హైలైట్.. ఫస్ట్ నైట్ రోజే అడ్వెంచర్
OTT Comedy Thriller: నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే ధూమ్ ధామ్ (Dhoom Dhaam) పేరుతో వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ చూశారా? ఈ మూవీ ట్విస్టులతోపాటు నవ్విస్తూనే థ్రిల్ పంచే తీరు బాగుంది. ఇప్పటి వరకూ చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి.

OTT Comedy Thriller: ఓటీటీలోకి డిఫరెంట్ జానర్లలో వచ్చే సినిమాలు చాలానే ఉంటున్నాయి. కొన్ని మూవీస్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టి అలరిస్తున్నాయి. అలాంటి మూవీయే ధూమ్ ధామ్. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో చూడండి.
ధూమ్ ధామ్.. ఫస్ట్ నైటే అడ్వెంచర్
ధూమ్ ధామ్ ఓ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని, ఓ హోటల్లో ఫస్ట్ నైట్ కు రెడీ అవుతుంటారు. అప్పుడే మోగిన డోర్ బెల్.. ఫస్ట్ నైట్ నే వాళ్లకు ఓ అడ్వెంచర్ గా మార్చేస్తుంది.
ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా ట్విస్టులతో మంచి థ్రిల్ పంచుతుంది. మొదటి నుంచీ చివరి వరకూ నవ్విస్తూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఈ రెండు గంటల్లోపు ఉన్న మూవీని ఆసక్తికరంగా మార్చేస్తాయి.
ఛార్లీ ఎక్కడ?
ఈ ధూమ్ ధామ్ మూవీ వీర్ పొద్దార్ (ప్రతీక్ గాంధీ), కోయల్ (యామీ గౌతమ్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. వీళ్ల ఫస్ట్ నైట్ రోజే ఛార్లీ ఎక్కడ అంటూ ఇద్దరు వ్యక్తులు వస్తారు. గన్ తో బెదిరిస్తారు.
పూర్తిగా పిరికివాడైన వీర్, డేరింగ్ గాళ్ కోయల్.. వీళ్ల బారి నుంచి ఎలా తప్పించుకుంటారు? అసలు ఆ ఛార్లీ ఎవరు? ఏంటి? ఓ దోపిడీ కేసులో కీలకమైన ఆధారం మిస్సయిన కేసులో ఈ కొత్తగా పెళ్లయిన జంట ఎలా చిక్కుకుంటుంది? అనేది ఈ ధూమ్ ధామ్ మూవీలో చూడొచ్చు.
ధూమ్ ధామ్ మూవీ ఎలా ఉందంటే?
ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్ నటించిన ధూమ్ ధామ్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని రిషబ్ సేఠ్ డైరెక్ట్ చేశాడు. కేవలం 108 నిమిషాల రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ కామెడీతోపాటు థ్రిల్ తోనూ ఆకట్టుకుంటుంది.
ఈ మూవీ ఓ దోపిడీ సీన్ తో మొదలవుతుంది. అక్కడి నుంచి సడెన్ గా మూవీలోని లీడ్ రోల్స్ పెళ్లి, ఫస్ట్ నైట్ కు వెళ్తుంది. అయితే ఆ జంట ఊహించని విధంగా ఓ పోలీస్ గ్యాంగ్, ఓ సీఐడీ గ్యాంగ్ మధ్య చిక్కుకుంటుంది. కనిపించకుండా పోయిన ఛార్లీని కనిపెట్టడం చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది.
ఈ క్రమంలో కొన్ని ట్విస్టులు అలరిస్తాయి. ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్ నటన కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక మూవీలో ఓ చోట యామీ గౌతమ్ ఏకధాటిగా 90 సెకన్లపాటు చెప్పే డైలాగ్ మరో హైలైట్. ఓవరాల్ గా ఈ ధూమ్ ధామ్ మూవీ మంచి టైంపాస్. రొమాన్స్, కామెడీ, యాక్షన్, థ్రిల్.. ఇలా అన్ని జానర్లు ఒకే మూవీలో చూపించేశారు మేకర్స్. ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే నెట్‌ఫ్లిక్స్ లో ఉంది చూసేయండి.
సంబంధిత కథనం