నెట్‌ఫ్లిక్స్ ధమాకా.. ఒకేసారి నాలుగు వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ-netflix announced new seasons for web series black warrant the royals maamla legal hai mismatched ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నెట్‌ఫ్లిక్స్ ధమాకా.. ఒకేసారి నాలుగు వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ ధమాకా.. ఒకేసారి నాలుగు వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ

Hari Prasad S HT Telugu

నెట్‌ఫ్లిక్స్ దూకుడు మీద ఉంది. ఒకేసారి అంటే బుధవారం (మే 28) గంటల వ్యవధిలోనే నాలుగు హిట్ వెబ్ సిరీస్ కు కొత్త సీజన్లు అనౌన్స్ చేయడం విశేషం. వీటిలో క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ కామెడీ జానర్ల సిరీస్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ధమాకా.. ఒకేసారి నాలుగు వెబ్ సిరీస్‌లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసిన ఓటీటీ

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ అయిన నాలుగు పాపులర్ వెబ్ సిరీస్ లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసింది. బుధవారం (మే 28) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్లాక్ వారెంట్ తోపాటు లీగల్ డ్రామా మామ్లా లీగల్ హై, ఈ మధ్యే వచ్చిన ది రాయల్స్, రొమాంటిక్ కామెడీ మిస్‌మ్యాచ్డ్ లాంటి సిరీస్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వరుసగా తన వెబ్ సిరీస్ లకు కొత్త సీజన్లు అనౌన్స్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇలా ఒకేసారి నాలుగు సిరీస్ లకు సీక్వెల్స్ అనౌన్స్ చేయడం విశేషం. మొదటగా ఈ మధ్యే తొలి సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాయల్స్ వెబ్ సిరీస్ సీక్వెల్ గురించి వెల్లడించింది.

ప్రస్తుతం రెండో సీజన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే స్ట్రీమింగ్ కు వస్తుందని తెలిపింది. ఇషాన్ ఖట్టర్, భూమి ఫెడ్నేకర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్

ఇక నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్లాక్ వారెంట్ కు కూడా రెండో సీజన్ వస్తోందని తెలిపింది. దేశంలోని ప్రముఖ జైలు తీహార్ లో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఈ ఏడాదే తొలి సీజన్ తో వచ్చిన సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 2019లో వచ్చిన ఓ బుక్ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా త్వరలోనే రాబోతోందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

లీగల్ డ్రామా వెబ్ సిరీస్

ఇక గతేడాది నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన సక్సెస్ సాధించిన మరో వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై. ఈ లీగల్ డ్రామా తెగ నవ్వించింది. ఈ సిరీస్ పట్పర్‌గంజ్ అనే కోర్టు, అక్కడి న్యాయవాదుల చుట్టూ తిరిగే స్టోరీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం రెండో సీజన్ సిద్ధమవుతోంది. త్వరలోనే కోర్టులో డేట్ లభించనుందంటూ ఈ సిరీస్ రెండో సీజన్ ను నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్

ఇక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ మిస్‌మ్యాచ్డ్ (Mismatched) కూడా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2020లో మొదలైన ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు చివరిదైన నాలుగో సీజన్ ను త్వరలోనే తీసుకురారున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం