Mystery Thriller Web Series: ఓటీటీలోకి చిరుత హీరోయిన్ బోల్డ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - తెలుగులోనూ రిలీజ్!
Mystery Thriller Web Series చిరుత ఫేమ్ నేహా శర్మ లీడ్ రోల్‌లో 36 డేస్ పేరుతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. జూలై 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ 36 డేస్ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతోంది.
Mystery Thriller Web Series చిరుత హీరోయిన్ నేహా శర్మ ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ త్వరలో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. 36 డేస్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూలై 12న 36 డేస్ వెబ్‌సిరీస్ ఓటీటీ రిలీజ్ కాబోతున్నట్లు సోనీ లివ్ అఫీషియల్‌గా ప్రకటించింది. 36 డేస్‌కు సంబంధించిన అన్ని సీక్రెట్స్ ఆ రోజు రివీల్ అవుతాయని వెల్లడించింది.

హాలీవుడ్ సిరీస్ రీమేక్...
36 డేస్ సిరీస్‌లో నేహా శర్మతోపాటు పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలను అందుకున్న బోల్డ్ వెబ్‌సిరీస్ 35 డేస్ ఆధారంగా ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌ను డైరెక్టర్ విశాల్ ఫ్యూరియా తెరకెక్కిస్తోన్నారు.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ రూపొందనున్నట్లు చెబుతోన్నారు. ఒక్కో ఎపిసోడ్ నలభై నిమిషాల నుంచి యాభై నిమిషాల నిడివితో ఉంటాయని అంటున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీతో పాలు పలు భాషల్లో 36 డేస్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
స్విమ్ సూట్‌లో నేహా శర్మ...
ఇటీవలే 36 డేస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పురబ్ కోహ్లికి చెందిన అపార్ట్‌మెంట్ లోకి రెంట్ కు వచ్చినట్లుగా నేహా శర్మ కనిపించింది. స్విమ్ సూట్‌లో పూల్లోకి దిగుతూ బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఓ యువకుడితో నేహా శర్మ రొమాన్స్, ఆ తర్వాత వచ్చే ట్విస్టులతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
ట్రైలర్‌లో నేహాశర్మ క్యారెక్టరైజేషన్‌ను ఆద్యంతం సస్పెన్స్‌గా చూపించారు. ఓ వృద్ధురాలు కనిపించకుండా పోవడం, ఆ తర్వాత జరిగిన హత్యతో ట్రైలర్ మలుపులతో ఎంగేజింగ్‌గా సాగింది. నేహా శర్మ ఎవరు? అక్కడికి ఎందుకు వచ్చింది? ఏం చేసింది అనే అంశాలతో ట్రైలర్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించారు డైరెక్టర్.
ఇంజూరియస్ టూ హెల్త్...
36 డేస్ వెబ్ సిరీస్ కు టైటిల్ కింద ఉన్న సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ట్యాగ్ లైన్ ఆసక్తిని పంచుతోంది. 36 డేస్ వెబ్‌సిరీస్‌ను అప్లౌజ్ ఎంటర్‌టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహిస్తోన్నాడు. గతంలో అతడు ఫోరెన్సిక్, ఛోరీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ కథాంశాలతో పలు సినిమాలు చేస్తోన్నాడు.
బోల్డ్ రోల్...
ఈ సిరీస్‌లో నేహా శర్మ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన బోల్డ్ రోల్‌లో కనిపిస్తుందని మేకర్స్ చెబుతోన్నారు. నటిగా ఆమెను కొత్త కోణంలో ఈ సిరీస్ ఆవిష్కరిస్తుందని చెబుతోన్నారు.
చిరుతతో
రామ్‌చరణ్ చిరుత మూవీతో హీరోయిన్‌గా నేహా శర్మ సినీ కెరీర్ మొదలైంది. మొదటి సినిమాలోనే అందాల ఆరబోతతో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో కుర్రాడు చేసింది. కుర్రాడు పరాజయం పాలవ్వడంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు షిప్ట్ అయ్యింది నేహా శర్మ.
హిందీలో క్యా సూపర్ కూల్ హై హమ్, యామ్ల పాగ్లా దీవానా 2, యంగిస్థాన్, తుమ్‌బిన్ 2, తానాజీతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ఎక్కువగా గ్లామర్ రోల్స్‌లోనే కనిపించింది. గత ఏడాది రిలీజైన జోగిర సారా రా రా తర్వాత బాలీవుడ్ ప్రేక్షకుల మళ్లీ కనిపించలేదు నేహా శర్మ. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. ఇల్లీగల్ అనే హిందీ వెబ్‌సిరీస్‌లో లాయర్ పాత్రలో నేహా శర్మ నటనకు ప్రశంసలు దక్కాయి.