Bigg Boss 6 Telugu Episode 22: నేహా ఎలిమినేట్ - రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యానని కామెంట్స్-neha eliminated in third week from bigg boss 6 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Neha Eliminated In Third Week From Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu Episode 22: నేహా ఎలిమినేట్ - రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యానని కామెంట్స్

Nelki Naresh Kumar HT Telugu
Sep 26, 2022 06:50 AM IST

Bigg Boss 6 Telugu Episode 22: బిగ్‌బాస్ సీజ‌న్ 6 మూడో వారంలో నేహా ఎలిమినేట్ అయ్యింది. ప‌ది మంది కంటెస్టెంట్స్ నామినేష‌న్స్ లో నిల‌వ‌గా వివిధ టాస్క్ ల‌లో మిగిలిన వారు సేఫ్ అయ్యారు. రేవంత్ వ‌ల్లే తాను ఎలిమినేట్ అయిన‌ట్లు నేహా చెప్పింది.

నేహా
నేహా (Twitter)

Bigg Boss 6 Telugu Episode 22: బిగ్ బాస్ మూడో వారంలో ఊహించని విధంగా నేహా ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్ చివరలో నేహా, వాసంతి నిలిచారు. ఇద్దరికి కలిపి ఇచ్చిన టాస్క్ లో నేహా ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. నమ్మినవాళ్లు మోసం చేయడంతోనే హౌజ్ నుంచి బయటకు రావాల్సివచ్చిందంటూ నేహా చెప్పింది.

సుత్తి దెబ్బ టాస్క్

అంతకుముందు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సుత్తిదెబ్బ ఆట ఆడించాడు నాగార్జున. హౌజ్ లో నోటిదూల ఎవరికి ఎక్కువ అని ఆదిరెడ్డిని నాగార్జున అడిగాడు. అతడు గీతూ పేరు చెప్పి ఆమె తలపై సుత్తితో కొట్టాడు. ఆడియోన్స్ పోల్ అడగ్గా 22 మంది గీతూకు నోటిదూల అని చెప్పారు. బ్రెయిన్ లెస్ పర్సన్ ఎవరో చెప్పాలని రోహిత్, మరీనాను నాగార్జున అడిగాడు. వారు రాజ్ పేరు చెప్పారు. కానీ ఆడియోన్స్ మాత్రం భిన్నంగా ఆన్సర్ ఇచ్చాడు.

రేవంత్ పనిదొంగ

హౌజ్ లో పనిదొంగ ఎవరని రాజ్ ను అడగ్గా అతడు రేవంత్ పేరు చెప్పాడు. కానీ ఆడియోన్స్ మాత్రం యూననమస్ గా రాజ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఓవర్ డ్రామటిక్ ఎవరని రేవంత్ ను అడిగితే అతడు నేహా పేరుచెప్పాడు. ప్రతి విషయంలో రేవంత్ తనను టార్గెట్ చేస్తున్నాడని నేహా అన్నది. ఎన్నోయింగ్ పర్సన్ ఎవరిని నేహా అడగ్గా గీతూ పేరు చెప్పింది.

లూజర్ ఎవరని గీతూను అడగ్గా రేవంత్ పేరు చెప్పింది. ఆట విషయంలో అతడిలో సీరియస్ నెస్ కనిపించదని చెప్పింది. కానీ ఆడియెన్స్ పోల్ మాత్రం వ్యతిరేకంగా వచ్చింది. అటెన్షన్ సీకర్ ఎవరని శ్రీసత్యను అడగ్గా ఆమె బాలాదిత్య పేరు చెప్పింది. హౌజ్ లో ఫైటర్ కాకర్ ఎవరని కీర్తిని అడగితే ఆమె రేవంత్ పేరు చెప్పింది. నాగార్జున హౌజ్ మేట్స్ కు ఎన్వలప్స్ ఇచ్చి ఎవరి దగ్గర ఎక్కువ క్యాష్ ఉంటే వారు సేఫ్ అని ప్రకటించారు. ఇందులో గీతూ, శ్రీహాన్ వద్ద అందరికంటే ఎక్కువగా 1500 ఉండటంతో వారిద్దరు సేఫ్ అయ్యారు.

ఇనాయా యూజ్ లెస్

హౌజ్ లో యూజ్ లెస్ పర్సన్ ఎవరని శ్రీహాన్ ను అడగ్గా ఇనాయా పేరు చెప్పాడు. ఆడియెన్స్ కూడా అతడి నిర్ణయానికే ఓటు వేశారు. హౌజ్ లో తిండిబోతు ఎవరని సుదీపను అడగ్గా ఆమె రేవంత్ పేరు చెప్పింది. కానీ ఆడియెన్స్ మాత్రం మళ్లీ నో చెప్పారు. హౌజ్ లో యారోగెంట్ ఎవరిని వాసంతిని అడిగితే ఆమె ఇనాయా పేరు చెప్పింది. హౌజ్ లో బిట్టర్ పర్సన్ ఎవరని చంటిని అడిగితే ఇనాయా పేరు చెప్పిన అతడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతుందని అన్నాడు ఆడియెన్స్ కూడా ఒప్పుకున్నారు.

గీతూ బోరింగ్

బోరింగ్ పర్సన్ ఎవరిని సూర్యను అడిగితే అతడు గీతూ పేరు చెప్పాడు. హౌజ్ లో ఫేక్ ఎవరని గీతూను అడిగితే ఆమె ఆరోహి తలపై సుత్తితో కొట్టింది. ఆడియెన్స్ మాత్రం నో చెప్పారు. హౌజ్ లో ఎయిమ్ లెస్ పర్సన్ ఎవరో చెప్పాలని అర్జున్ కళ్యాణ్ ను నాగార్జున అడిగారు అతడు రోహిత్ మరీనా పేరు చెప్పాడు. ఆడియెన్స్ కూడా అతడి నిర్ణయాన్ని అంగీకరించారు. ఆ తర్వాత లీవ్స్ టాస్క్ లో రేవంత్, ఇనాయా సేఫ్ అయ్యారు.

రేవంత్ గాడిద...

ఆ తర్వాత ఇంటి సభ్యులతో ట్యాగ్ గేమ్ ఆడించాడు నాగార్జున. కొన్ని జంతువుల పేర్లు రాసి ఉన్న ట్యాగ్ లలో ఎవరికి డెడికేటెడ్ చేస్తారో సరైన రీజన్ ద్వారా చెప్పాలని కంటెస్టెంట్స్ ను నాగార్జున అడిగాడు. తొలుత గీతూ ఊసరవెళ్లి ట్యాగ్ ను నేహాకు ఇచ్చింది. పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోతుందని చెప్పింది. ఆ తర్వాత నేహా కూడా అదే ఊసరవెళ్లి ట్యాగ్ ను గీతూ మెడలో వేసింది. హౌజ్ లో క్లారిటీ లేకుండా మాట్లాడటమే కాకుండా నాకే తెలుసు అనే ధోరణిలో వ్యవహరిస్తుందని చెప్పింది.

ఆ తర్వాత చంటి గాడిద ట్యాగ్ ను రేవంత్ మెడలో వేశాడు. గాడిదలాగా కష్టపడతాడని, కానీ పద్దతి ఉండదని అన్నాడు. ఆ తర్వాత రేవంత్ పాము ట్యాగ్ ను ఆరోహికి ఇచ్చాడు. సూర్య సింహం ట్యాగ్ ను గీతూకు డెడికేట్ చేశాడు. ఫైమా కూడా సింహాం ట్యాగ్ ను చంటి మెడలో వేసింది. వాసంతి సింహం ట్యాగ్ ను రేవంత్ కు ఇచ్చింది. మంచి చెడు ఏదైనా నిర్మొహమాటంగా చెబుతాడని అన్నది. బాలాదిత్య ఏనుగు ట్యాగ్ ను ఆదిరెడ్డి మెడలో వేశాడు. ఆరోహి గాడిద ట్యాగ్ ను కీర్తి మెడలో వేసింది. కీర్తి ఊసరవెల్లి ట్యాగ్ ను కీర్తి మెడలో వేసింది.

శ్రీహాన్ ఊసరవెల్లి

ఇయానా ఊసరవెల్లి ట్యాగ్ ను శ్రీహాన్ మెడలో వేసింది. కావాలనే గొడవలు పడుతున్నాడని చెప్పింది. ఆది రెడ్డి పాము ట్యాగ్ ను శ్రీసత్య మెడలో వేశాడు. రాజ్ గాడిద ట్యాగ్ ను అర్జున్ మెడలో వేశాడు. అర్జున్ కూడా గాడిద ట్యాగ్ ను సుదీప మెడలో వేశాడు. ఆ తర్వాత ఇచ్చిన టాస్క్ లో బాలాదిత్య, ఆరోహి సేఫ్ అయ్యారు. ఆ తర్వాత హౌజ్ మేట్స్ తో డంబ్ షరాడ్స్ గేమ్ ఆడించాడు. స్క్రీన్ పై కొన్ని బొమ్మలు చూపించి ఓ కంటెస్టెంట్ సైగలతో యాక్ట్ చేసి చూపిస్తే మిగిలిన కంటెస్టెంట్స్ సరైన ఆన్సర్ చెప్పాలని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత ఇచ్చిన టాస్క్ లో చంటి సేవ్ అయ్యాడు.

వాసంతి సేఫ్ నేహా ఔట్

చివరగా నామినేషన్స్ లో వాసంతి, నేహా మిగలగా తులాభారం టాస్క్ లో నేహా ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. నేహా ఎమోషనల్ అయ్యింది. స్టేజ్ పైకి వచ్చిన నేహాకు ఆమె జర్నీని చూపించాడు నాగార్జున. హౌజ్ దమ్మున్న కంటెస్టెంట్స్, దుమ్ము కంటెస్టెంట్స్ ఎవరిని నాగార్జున నేహాను అడిగాడు.

దమ్మున్న కంటెస్టెంట్స్ గా చంటి, సుదీప, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, బాలాదిత్య, ఆదిరెడ్డి పేర్లను చెప్పింది. దుమ్ము కంటెస్టెంట్స్ గా రేవంత్, ఇనాయా, అర్జున్ కళ్యాణ్, ఆరోహి, వాసంతి, గీతూ పేర్లను చెప్పింది. పర్సనల్ గా రేవంత్ వల్లే తాను ఇక్కడ ఉన్నానని చెప్పింది. తాను రేవంత్ ను మోటివేట్ చేశానని, గొడవలు పడితే లాక్కోచ్చానని చెప్పింది. ఆరోహి కూడా తన ఆట తాను ఆడితే బాగుంటుందని చెప్పింది.

బిగ్ బాస్

IPL_Entry_Point