అమ్మ కోసం పాడేయండి.. నీవే నీవే సాంగ్ లిరిక్స్ ఇవే.. మదర్స్ డే స్పెషల్-neeve neeve song lyrics from amma nanna o tamila ammai raviteja jayasudha mothers day special ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అమ్మ కోసం పాడేయండి.. నీవే నీవే సాంగ్ లిరిక్స్ ఇవే.. మదర్స్ డే స్పెషల్

అమ్మ కోసం పాడేయండి.. నీవే నీవే సాంగ్ లిరిక్స్ ఇవే.. మదర్స్ డే స్పెషల్

మదర్స్ డే వచ్చేస్తోంది. మరో రెండు రోజులే ఉంది. ఈ మదర్స్ డే రోజు అమ్మను పాటతో సర్ ప్రైజ్ చేయాలనుకుంటే ఈ సాంగ్ పాడేయండి. ‘నీవే నీవే’ సాంగ్ లిరిక్స్ మీకోసం.

నీవే నీవే సాంగ్ లిరిక్స్ (youtube)

అమ్మ లేనిదే జన్మ లేదు. అమ్మ లేనిదే జీవితం లేదు. అమ్మ లేనిదే అసలు మనమే లేం. ఆ అమ్మ గొప్పతనాన్ని చాటేందుకు ఎన్ని మాటలైనా చాలవు. అమ్మ ఆప్యాయతను చెప్తూ, అమ్మ కష్టాన్ని గుర్తు చేస్తూ తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు వచ్చాయి. వీటిల్లో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలోని ‘నీవే నీవే’ సాంగ్ మాత్రం స్పెషల్ గా నిలిచిపోయింది. మే 11న మదర్స్ డే రోజు మీ అమ్మ కోసం ఈ సాంగ్ పాడేయండి.

నా కలలను కన్నది నీవే

‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ మూవీలోని ‘నీవే నీవే’ సాంగ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. ఈ పాటలోని లిరిక్స్ గుండెను హత్తుకునేలా ఉన్నాయి. సినిమా రిలీజై రెండు దశాబ్దాలు గడిచిపోయినా ఈ మాట పాత్రం వినిపిస్తూనే ఉంటోంది. 2003లో ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ మూవీ రిలీజైంది.

హైలైట్ సాంగ్

జయసుధ, రవితేజ తల్లీకొడుకులుగా యాక్ట్ చేశారు. సినిమాలో వీళ్ల మధ్య అనుబంధం ప్రతి తల్లీకొడుకులకు కనెక్టయింది. ఇక ‘నీవే నీవే’ సాంగ్ మరింత హైలైట్. ఈ సాంగ్ వస్తుంటే ప్రతి తల్లీకొడుకు తమను తాము ఊహించుకుని మురిసిపోతుంటారు. ఈ అద్భుతమైన పాటను పెద్దాడ మూర్తీ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రీనే ఈ సాంగ్ ను ఎంతో గొప్పగా పాడారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిపోయింది.

ఇదిగో లిరిక్స్

పల్లవి

నీవే నీవే నీవే నేనంటా

నీవే లేక నేనే లేనంటా

వరమల్లే అందిందేమో ఈ బంధం

వెల లేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా

నీవే లేక నేనే లేనంటా

వరమల్లే అందిందేమో ఈ బంధం

వెల లేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా

నీవే లేక నేనే లేనంటా

చరణం 1

నా కలలను కన్నది నీవే

నా మెలకువ వేకువ నీవే

ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా

నా కష్టం ఇష్టం నీవే

చిరునవ్వు దిగులు నీవే

ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా

కనిపించకపోతే బెంగై వెతికావె

కన్నీరే వస్తే కొంగై తుడిచావే

నీవే నీవే నీవే నేనంటా

నీవే లేక నేనే లేనంటా

చరణం 2

నే గెలిచినా విజయం నీదే

నే ఓడిన క్షణం ఓదార్పే

నా అలసట తీరే దారే నీవేగా

అడుగడుగున నడిపిన దీపమ

ఇరువురికే తెలిసిన స్నేహమ

మది మురిసే ఆనందాలే నీవేగా

జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే

ధన్యోస్మి అంటూ దండం పెడతాలే

నీవే నీవే నీవే నేనంటా

నీవే లేక నేనే లేనంటా

వరమల్లే అందిందేమో ఈ బంధం

వెల లేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా

నీవే లేక నేనే లేనంటా

వరమల్లే అందిందేమో ఈ బంధం

వెల లేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా

నీవే లేక నేనే లేనంటా

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం