Neevalle Song Lyrics: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇవే.. మాయ చేస్తున్న సిద్ శ్రీరామ్ వాయిస్
Neevalle Song Lyrics: నీవల్లే అనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీ నుంచి మూడు రోజుల కిందట వచ్చిన ఈ పాట అప్పుడే మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ పాడుకోండి.

Neevalle Song Lyrics: నీవల్లే నీవల్లే అంటూ సిద్ శ్రీరామ్ పాడిన ఓ పాట ఇప్పుడు యువతను తెగ ఆకట్టుకుంటోంది. త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీ నుంచి మూడు రోజుల కిందట ఈ పాట రిలీజైంది. అప్పుడే మిలియన్ మార్క్ దాటి దూసుకెళ్తోంది. రోజురోజుకూ నీవల్లే సాంగ్ క్రేజ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. చూసి మీరూ కాస్త గళం సవరించుకోండి.
దుమ్ము రేపుతున్న నీవల్లే సాంగ్
నీవల్లే సాంగ్ త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీలోనిది. వశిష్ట, సాంచీ రాయ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ ఈ పాట పాడాడు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ మ్యూజిక్ అందించింది. రఘురాం లిరిక్స్ అందించాడు. వల్లి గాయత్రి, లక్ష్మి మేఘన, ప్రియా, బృందలాంటి వాళ్లు కోరస్ అందించారు.
ఈ త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీకి కథ అందించి డైరెక్ట్ చేస్తున్నాడు మోహన్ శ్రీవత్స. విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజైన నీవల్లే సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ పాటను కంపోజ్ చేసిన విధానం, లిరిక్స్, స్టెప్స్ మరింత హైలైట్ గా నిలిచాయని చెప్పొచ్చు.
సిద్ శ్రీరామ్ వాయిస్ కు తెలుగులో చాలా మంది అభిమానులే ఉన్నారు. అతడు మరోసారి ఈ నీవల్లే పాటతో ఆకట్టుకుంటున్నాడు. త్రిబాణధారి బార్బారిక్ అనే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.
ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మారుతి సమర్పిస్తుండటం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
నీవల్లే సాంగ్ లిరిక్స్
ఏం అవుతున్నదో నా గుండెలో..
ఉంటుంది ఈ రోజిలా..
ఏం దాచుంచావో ఆ కళ్లలో..
నిలువెల్లా మునిగానిలా..
ఈ సంగతే నచ్చింది చాలా..
నీ సందడే నాలోపలా..
ఈ హాయినే మోయాలి అంటే..
ఎలా.. ఎలా..
నీవల్లే నీవల్లే ఈ మాయే నీవల్లే..
కల్లోనూ కల్లోలాలే నీవల్లే..
నీవల్లే నీవల్లే ఆనందం నన్నెల్లే..
మొత్తంగా మరిచాను నా నిన్నలే..
నీవల్లే నీవల్లే వెన్నెల్లో వర్షాలే..
కురిసాయిలే నీవల్లే..
నీవల్లే నీవల్లే వేవేల వర్ణాలే
నా చుట్టూ వాలాయిలే నీవల్లే..
నిన్నా మొన్నా నా తీరులో..
లేనే లేదే ఈ ఆరాటం..
నీతో పాటే అడుగేస్తుంటే..
మారిందే నా వాలకం..
సరదా సరదాగా సాగే ఈ పయనం..
సరిపోవట్లేదే నీతోటి సమయం..
జతగా నువ్వుంటే.. అంతే అదృష్టం..
అతిగే పొగిడేస్తే కాదే నా నేరం..
ఈ సంగతే నచ్చింది చాలా..
నీ సందడే నా లోపలా..
ఈ హాయినే మోయాలి అంటే..
ఎలా.. ఎలా..
నీవల్లే నీవల్లే ఈ మాయే నీవల్లే..
కల్లోనూ కల్లోలాలే నీవల్లే..
నీవల్లే నీవల్లే ఆనందం నన్నెల్లే..
మొత్తంగా మరిచాను నా నిన్నలే..
నీవల్లే నీవల్లే వెన్నెల్లో వర్షాలే..
కురిసాయిలే నీవల్లే..
నీవల్లే నీవల్లే వేవేల వర్ణలే
నా చుట్టూ వాలాయిలే నీవల్లే..
సంబంధిత కథనం