నీలి నీలి ఆకాశం సాంగ్ లిరిక్స్: ఎవర్‌గ్రీన్ లవ్ సాంగ్.. యూట్యూబ్‌లో 31 కోట్లకుపైగా వ్యూస్-neeli neeli aakasham song lyrics 30 rojullo preminchadam ela movie song telugu songs lyrics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నీలి నీలి ఆకాశం సాంగ్ లిరిక్స్: ఎవర్‌గ్రీన్ లవ్ సాంగ్.. యూట్యూబ్‌లో 31 కోట్లకుపైగా వ్యూస్

నీలి నీలి ఆకాశం సాంగ్ లిరిక్స్: ఎవర్‌గ్రీన్ లవ్ సాంగ్.. యూట్యూబ్‌లో 31 కోట్లకుపైగా వ్యూస్

Hari Prasad S HT Telugu

నీలి నీలి ఆకాశం అంటూ వచ్చిన తెలుగు సాంగ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. యూట్యూబ్ లో ఇప్పటికే 31 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకున్న ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

నీలి నీలి ఆకాశం సాంగ్ లిరిక్స్: ఎవర్‌గ్రీన్ లవ్ సాంగ్.. యూట్యూబ్‌లో 31 కోట్లకుపైగా వ్యూస్

యాంకర్ ప్రదీప్ హీరోగా మారిన మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమా రిలీజై ఐదేళ్లు అయింది. మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఇందులోని నీలి నీలి ఆకాశం సాంగ్ మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ మెలోడీ సాంగ్ తెలుగులో వచ్చిన ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్స్ లో ఒకటి. మరి ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

నీలి నీలి ఆకాశం సాంగ్ గురించి..

యాంకర్ ప్రదీప్, అమృత అయ్యర్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. మున్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. అతడు కంపోజ్ చేసిన పాటే ఈ నీలి నీలి ఆకాశం. అప్పుడే కాదు.. ఇప్పటికీ సూపర్ హిట్ లవ్ సాంగ్స్ లో ఒకటి.

చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత కలిసి పాడారు. ఈ పాట యూట్యూబ్ లోకి జనవరి 31, 2020లో వచ్చింది. ఇప్పటి వరకూ 31 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

నీలి నీలి ఆకాశం సాంగ్ లిరిక్స్

పల్లవి

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

మానేస్తు ఉన్నా

నెలవంకను ఇద్దామనుకున్నా

ఓ..ఓ..ఓ.. నీ నవ్వుకు సరిపోదంటున్నా..

నువ్వే నడిచేటి తీరుకే

తారలు మొలిచాయి నేలకే

నువ్వే వదిలేటి శ్వాసకే

గాలులు బ్రతికాయి చూడవే

ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

మానేస్తు ఉన్నా

చరణం 1

ఓ.. ఓ.. వాన విల్లులో.. ఉండని రంగు నువ్వులే

యే రంగులా చీరను నీకు నెయ్యాలే..

నల్ల మబ్బులా.. మెరిసే కళ్లు నీవిలే..

ఆ కళ్లకూ కాటుక ఎందుకెట్టాలే..

చెక్కిలిపై చుక్కగా.. దిష్టే పెడతారులే

నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా..

ఏదీ నీ సాటి రాదిక.. అంటూ ఓడాను పూర్తిగా..

కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా..

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

నీ హృదయం ముందర

ఆకాశం చిన్నది అంటున్నా

చరణం 2

ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే

ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే

నాన్న వేలితో నడిపే ధైర్యమే నీవే..

నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే

దయ గలిగిన దేవుడే.. మనలను కలిపాడులే

వరమోసిగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా..

ఏదీ నీ సాటి రాదిక.. అంటూ అలిసాను పూర్తిగా..

కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని

మానేస్తు ఉన్నా

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం