OTT Romantic Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-neeli megha shyama ott release date telugu romantic movie to stream on aha video from 9th january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Romantic Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Jan 02, 2025 09:28 PM IST

Neeli Megha Shyama OTT Release Date: ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో కాకుండా ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కే సిద్ధం కావడం విశేషం. తాజాగా ఆహా వీడియో ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది.

నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Neeli Megha Shyama OTT Release Date: ఆహా వీడియో ఓటీటీ ఈ మధ్య వరుస ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ నీలి మేఘ శ్యామ రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని గతంలోనే అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. గురువారం (జనవరి 2) తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించింది. మరో వారంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

yearly horoscope entry point

నీలి మేఘ శ్యామ ఓటీటీ రిలీజ్ డేట్

గతేడాది తెలుగులో లోబడ్జెట్ మూవీగా వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించిన 35 చిన్న కథ కాదు మూవీలో నటించిన విశ్వదేవ్ రాచకొండ లీడ్ రోల్లో ఈ నీలి మేఘ శ్యామ మూవీ వస్తోంది. ఈ సినిమాను జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో వెల్లడించింది.

"మీతో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ, ఎమోషన్స్, స్టోరీస్ కు సంబంధించిన విభిన్నమైన షేడ్స్.. నీలి మేఘ శ్యామ జనవరి 9న ఆహాలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో గురువారం (జనవరి 2) ట్వీట్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. మంచి మొత్తానికే ఈ సినిమా డిజటల్ హక్కులను ఆహా వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం.

నీలి మేఘ శ్యామ గురించి..

ఓ ట్రెక్కింగ్ ఓ యువకుడి జీవితాన్ని ఎలా మార్చేసిందన్నది ఈ నీలి మేఘ శ్యామ మూవీలో చూడొచ్చు. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ ఫిమేల్ లీడ్ గా నటించింది. గతంలోనూ మూవీ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. రవి ఎస్ వర్మ సినిమాను డైరెక్ట్ చేశాడు. లోబడ్జెట్ మూవీ అయినా.. ఓటీటీలో నీలి మేఘ శ్యామకు మంచి రెస్పాన్స్ వస్తుందని మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది.

ఈ సినిమాకు శరణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మొదట థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా రోజులు ప్రయత్నించినా.. తర్వాత నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు. లీడ్ రోల్లో నటించిన విశ్వదేవ్ రాచకొండ ఈ మధ్యే మెకానిక్ రాకీ మూవీలో కనిపించిన విషయం తెలిసిందే.

Whats_app_banner