OTT Romantic Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ డైరెక్ట్ చేసిన డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగులోనూ..-neek ott release date dhanush directed romantic comedy movie to stream on amazon prime video from 21st march ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ డైరెక్ట్ చేసిన డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగులోనూ..

OTT Romantic Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ డైరెక్ట్ చేసిన డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగులోనూ..

Hari Prasad S HT Telugu

OTT Romantic Comedy: ఓటీటీలోకి సరిగ్గా నెల రోజుల తర్వాత వస్తోంది ధనుష్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ డైరెక్ట్ చేసిన డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగులోనూ..

OTT Romantic Comedy: తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన మూవీ నెలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబమ్ (NEEK). ఈ సినిమా గత నెల 21న థియేటర్లలో రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట కన్ఫమ్ అయింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

నీక్ ఓటీటీ రిలీజ్ డేట్

ధనుష్ డైరెక్ట్ చేసిన నీక్ మూవీ వచ్చే శుక్రవారం (మార్చి 21) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇన్నాళ్లూ ఈ తేదీపై పుకార్లు రాగా.. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో పవీష్ నారాయణ్, మాథ్యూ థామస్ లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, శరత్ కుమార్, వెంకటేశ్ మేనన్, రబియా ఖాతూన్, రమ్య రంగనాథన్ లాంటి వాళ్లు కూడా నటించారు.

నీక్ మూవీ గురించి..

ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన నెలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబమ్ (నీక్) మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైంది. మరో తమిళ సినిమా డ్రాగన్ తో పోటీ పడినా.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది. తెలుగులోనూ జాబిలమ్మ నీకు అంత కోపమా పేరుతో రిలీజ్ చేశారు.

అయితే ఇక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పెద్ద చెఫ్ కావాలని కలలు కనే ఓ యువకుడు ప్రేమలో విఫలమవుతాడు. ఆ తర్వాత అతడు తల్లిదండ్రులు కుదర్చిన పెళ్లికి సిద్ధమవుతాడు. వారం రోజుల పాటు తనకు కాబోయే భార్యతో రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటాడు. అయితే పెళ్లికి రెడీ అవుతున్న తరుణంలో తన పాత లవర్ మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది. దీంతో పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయి. తర్వాత ఏం జరిగిందన్నది ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీలో చూడొచ్చు.

థియేటర్లలో ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు కూడా ఆదరించలేదు. అయితే ఓటీటీలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. మరి ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏం చేస్తుందో చూడాలి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం