Prabhas Movie : ప్రభాస్ సినిమా కోసం స్టార్ హీరోయిన్ కావలెను
Prabhas Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తదపరి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు డార్లింగ్. అయితే ప్రభాస్ సినిమాలో స్టార్ హీరోయిన్ కోసం వేట సాగుతుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు(Prabhas Movies) అనుకున్నంత గొప్పగా ఆడలేదు. ఇటీవలే వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఓటీటీ(OTT)లోకి వచ్చి కూడా విమర్శలపాలైంది. దీంతో తర్వాతి ప్రాజెక్టులపై కాన్సంట్రేట్ చేస్తు్న్నాడు డార్లింగ్. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే.. స్టార్ డైరెక్టర్లో పని చేస్తున్నాడు. ప్రభాస్ తదుపరి సినిమాలు సలార్(Salaar), కల్కి 2989ఏడీ(Kalki 2989AD) సినిమాలోపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతోపాటు డైరెక్టర్ మారుతీతోనూ ఓ సినిమాకు ఒప్పుకున్నాడు ప్రభాస్.

ప్రభాస్ ఒకదాని తర్వాత ఒకటి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మారుతీతో చేసే సినిమా రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలో మూడో షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ చిత్రంలో ఐటెం సాంగ్(Item Song) సూపర్ గా ఉండనుందని టాక్. ఈ పాటలో ఆకట్టుకునే స్టార్ హీరోయిన్ కోసం వేట కొనసాగుతుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మారుతీ, అతని బృందం తెలుగు, హిందీ సినిమాలకు చెందిన కొంతమంది పెద్ద హీరోయిన్లను చూస్తున్నారు. మారుతీ, ప్రభాస్ సినిమా(Maruthi Prabhas Movie)కు రాజా డిలాక్స్ అని పేరు అంటున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. నిధి అగర్వాల్ కూడా కనిపించనుంది.
ప్రస్తుతానికి సలార్, కల్కి ఏడీ2898 సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు ప్రభాస్. ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమాల కోసం ఎదురచూస్తున్నారు. విడుదలకు దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 28న సలార్ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే సలార్ సినిమా రికార్డులు సృష్టించింది. టీజర్ జూలై 6న విడుదలై చాలా రోజులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ లోనే ఉంది. ఇటు ప్రభాస్, అటు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సహజంగానే వీరిద్దరి కాంబినేషన్ అనడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే పెద్ద బ్రేక్ కావాల్సి ఉంది. సలార్‌తో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాడని భావిస్తున్నారు.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే కేజీఎఫ్ 2(KGF 2), సలార్ సినిమాకు కనెక్షన్ ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, రామచంద్రరాజు, మధు గురుస్వామి, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, తిను ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సమకూరుస్తుండగా, భువన్ గౌడ కెమెరా వర్క్ చేశారు. 200 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిలింస్ విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రభాస్ తన మరో చిత్రం కల్కి 2898ఏడీ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఇప్పటి వరకూ ఇండియాలో పెట్టనంత బడ్జెట్ పెడుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కావడంతో సహజంగానే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమా తర్వాత.. మారుతీ-ప్రభాస్ సినిమా రానుంది.