NBK109 Glimpse: సింహం నక్కల మీదికి వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఎన్‌బీకే109 గ్లింప్స్ అదిరిపోయింది
NBK109 Glimpse: మహా శివరాత్రినాడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బీకే 109 గ్లింప్స్ వీడియో రిలీజైంది. ఇందులో పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ తో బాలయ్య అదరగొట్టాడు.
NBK109 Glimpse: బాలకృష్ణ అంటేనే బ్లడ్ బాత్ కా బ్రాండ్.. వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ ఎన్‌బీకే 109 ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిన మేకర్స్.. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా గ్లింప్స్ వీడియోలో రిలీజ్ చేశారు. సింహం నక్కల మీదికి వెళ్తే అది వార్ అవ్వదు రా లఫూట్ అనే ఓ బాలయ్య మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ తో వచ్చిన ఈ గ్లింప్స్ ఇన్‌స్టాంట్ హిట్ అయింది.
ఎన్‌బీకే 109 గ్లింప్స్
బాలయ్య మార్క్ పంచ్ డైలాగులు, యాక్షన్ లేకుంటే అది నందమూరి నటసింహం సినిమా ఎలా అవుతుంది. అందుకే బాలకృష్ణ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అతని మార్క్ ఉండాల్సిందే అనుకుంటారు మేకర్స్. తాజాగా వచ్చిన ఎన్‌బీకే 109 మూవీ గ్లింప్స్ వీడియో కూడా అలాగే ఉంది. వాల్తేర్ వీరయ్యలాంటి మూవీని చిరంజీవికి అందించిన బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గ్లింప్స్ అదిరిపోయింది.
ఈ గ్లింప్స్ మొదట్లోనే మంటల్లో తగలబడుతున్న అడవి ఓ లాంగ్ షాట్ లో కనిపిస్తుంది. ఆ మంటల్లో అటూ ఇటూ పరుగెడుతున్న గుర్రాలు కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత కల్ట్ సరుకు గేట్లు ఎత్తగానే అందులో నుంచి వచ్చే మంటలు ఎన్‌బీకే అనే అక్షరాలను చూపిస్తాయి. చివరగా బాలయ్య బాబు మాస్ ఎంట్రీ ఇస్తాడు. కారులో వచ్చిన అతడు.. తనతోపాటు ఓ బాక్స్ బయటకు తీస్తాడు.
అందులో మాన్షన్ హౌజ్ మందు బాటిల్ ఉంటుంది. ఎదురుగా కత్తులు పట్టుకొని గూండాలు అతనివైపు దూసుకొస్తుంటారు. బ్యాక్‌గ్రౌండ్ లో "ఏరా వార్ డిక్లేర్ చేస్తున్నావా" అనే డైలాగ్ వినిపిస్తుంది. ఆలోపు ఆ మందు బాటిల్ ను తాగేసిన బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ డైలాగ్ వదులుతాడు. "సింహం నక్కల మీదికి వెళ్తే అది వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ బాలయ్య తనదైన స్టైల్లో చెబుతాడు.
ఇక ఆ తర్వాత అంతా రక్తపాతమే. తన మీదికి వచ్చిన విలన్లను ఊచకోత కోస్తాడు. ఈ డైలాగ్స్, యాక్షన్ కు తగినట్లుగా బ్యాక్‌గ్రౌండ్లో మ్యూజిక్ కూడా అదిరిపోయింది. చివర్లో ఎన్‌బీకే అనే ఇంగ్లిష్ అక్షరాలు రాగా.. దాని కింది నేచురల్ బార్న్ కింగ్ అని రాయడం విశేషం.
ఎన్‌బీకే 109 మూవీ గురించి..
గతేడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరిలతో హిట్ అందుకున్న బాలకృష్ణ.. తర్వాత బాబీ కొల్లితో కలిసి ఈ ఎన్‌బీకే 109 అనౌన్స్ చేశాడు. గతేడాది నవంబర్ 8న బాలయ్య బర్త్ డే సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
లైట్స్ యాక్షన్ కెమెరా అంటూ బాలకృష్ణ 109 మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌కు "బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్ నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ ఎన్బీకే 109 సినిమా షూటింగ్ ప్రారంభం" అని రాసుకొచ్చారు.
ఎన్బీకే 109 షూటింగ్ స్టార్ అయినట్లు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో గొడ్డలిని చూపించారు. ఆ గొడ్డలిపై స్పెక్ట్స్, మెడలో వేసుకునే దేవుడు చైన్ ఉన్నాయి. ఈ పోస్టర్ చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే గొడ్డలి కూడా డిఫరెంట్ డిజైన్‌తో ఉంది. గొడ్డలపై ఉన్న షేడ్స్ లో ఇద్దరూ ఫైట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.