NBK107 Title Launch: కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఎన్‌బీకే107 టైటిల్‌ లాంచ్‌-nbk107 title launch at historic kondareddy buruju in kurnool ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nbk107 Title Launch At Historic Kondareddy Buruju In Kurnool

NBK107 Title Launch: కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఎన్‌బీకే107 టైటిల్‌ లాంచ్‌

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 03:54 PM IST

NBK107 Title Launch: కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఎన్‌బీకే107 టైటిల్‌ లాంచ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ బుధవారం (అక్టోబర్‌ 19) అనౌన్స్‌ చేయగా.. శుక్రవారం (అక్టోబర్‌ 21) ఈ టైటిల్‌ లాంచ్‌ జరగనుంది.

కొండారెడ్డి బురుజు దగ్గర ఎన్బీకే107 టైటిల్ లాంచ్
కొండారెడ్డి బురుజు దగ్గర ఎన్బీకే107 టైటిల్ లాంచ్

NBK107 Title Launch: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఎన్‌బీకే107. బాలకృష్ణ కెరీర్‌లో ఇది 107వ సినిమా కావడంతో ప్రస్తుతానికి ఆ మూవీకి వర్కింగ్‌ టైటిల్‌గా దీనిని ఫిక్స్‌ చేశారు. అయితే ఇప్పుడీ మూవీ టైటిల్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. అక్టోబర్‌ 21న కర్నూలులోని చారిత్రక ప్రదేశమైన కొండారెడ్డి బురుజు దగ్గర ఈ టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరగనుండటం విశేషం.

ఈ కొండారెడ్డి బురుజును సినిమాల్లో ఎన్నోసార్లు చూసినా.. ఇప్పుడు అదే ప్రదేశంలో ఓ ఈవెంట్‌ నిర్వహించనుండటం మాత్రం తొలిసారి కానుంది. శుక్రవారం (అక్టోబర్‌ 21) రాత్రి 8.15 గంటలకు ఈ టైటిల్‌ లాంచ్‌కు ముహూర్తం పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్‌ నటిస్తోంది. ఇక దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ ఎన్‌బీకే107కి తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందించాడు. నేషనల్‌ అవార్డు గెలుచుకున్న నవీన్‌ నూలి ఈ సినిమాను ఎడిటింగ్‌ చేస్తున్నాడు. మాస్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేనితో బాలకృష్ణ మూవీ అనగానే దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పుడు చారిత్రక కొండరెడ్డి బురుజు దగ్గర టైటిల్‌ లాంచ్‌ చేయనుండటంతో ఫ్యాన్స్‌ దానికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి ఏ టైటిల్‌ పెడతారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ సినిమాకు రెడ్డిగారుతో పాటు అన్న‌గారు, జై బాల‌య్య అనే టైటిల్స్ ఏదో ఒక‌టి ఖ‌రారు చేసే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వీటిపై ఈ నెల 21న క్లారిటీ రాబోతున్న‌ది. ఇందులో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు.

సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌ను ఇప్ప‌టికే రిలీజ్ చేశారు. ఈ లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. మ‌రో లుక్ స్టైలిష్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో బాల‌కృష్ణ‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.