Nani | 'అంటే సుందరానికి' చిత్రం నుంచి నజ్రియా లుక్ వచ్చేసింది.. ఏం క్యూట్‌ ఉందో-nazriya nazim first look released from ante sundaraniki movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani | 'అంటే సుందరానికి' చిత్రం నుంచి నజ్రియా లుక్ వచ్చేసింది.. ఏం క్యూట్‌ ఉందో

Nani | 'అంటే సుందరానికి' చిత్రం నుంచి నజ్రియా లుక్ వచ్చేసింది.. ఏం క్యూట్‌ ఉందో

HT Telugu Desk HT Telugu

నేచురల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం అంటే సుందరానికి.. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా నజ్రియా లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

అంటే సుందరానికి (Twitter)

శ్యామ్‌సింగరాయ్ చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న మంచి జోష్ మీదున్నాడు నేచురల్ స్టార్ నాని. అంతేకాకుండా దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లలో సందడి చేసి మంచి సూపర్ హిట్‌గా నిలించింది. ఇదే ఊపులో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి.. అనే సినిమా చేస్తున్నాడు. అప్పుడెప్పుడో రాజా రాణి అనే అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నజ్రియా నజీమ్.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా నజ్రియా లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

మీట్ అవర్ లీలా.. లీలా థామస్ అంటూ నాని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నజ్రియా లుక్‌ను షేర్ చేశారు. దీన్ని బట్టి చిత్రంలో ఆమె పేరు లీలా అని తెలుస్తుంది. టాలీవుడ్‌లో ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు K.P.V.S.S.P.R సుందర ప్రసాద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దసరా అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. తొలిసారిగా నాని ఈ చిత్రం కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.

 

సంబంధిత కథనం