Web Series: ఫిల్మ్ జర్నలిస్ట్ మర్డర్ కేసుతో మలయాళ హీరోయిన్ వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే - తెలుగులోనూ స్ట్రీమింగ్
Web Series:ఫహాద్ ఫాజిల్ వైఫ్ మలయాళ హీరో నజ్రియా నజీమ్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ చేయబోతున్నది. 1940 దశకంలో మద్రాస్‌లో సంచలనం సృష్టించిన ఫిల్మ్ జర్మలిస్ట్ లక్ష్మీనాథన్ మర్డర్ కేసు ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
Web Series: 1940 దశకంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సంచలనం సృష్టించిన ఫిల్మ్ జర్నలిస్ట్ లక్ష్మీనాథన్ మర్డర్ కేసు ఆధారంగా తమిళంలో ఓ వెబ్‌సిరీస్ రాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో ఫహాద్ ఫాజిల్ వైఫ్, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ కీలక పాత్రలో నటించబోతున్నది.
ఈ సిరీస్‌కు ది మద్రాస్ మర్డర్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఈ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లో నజ్రియా నజీమ్‌తో పాటు శంతను భాగ్యరాజ్, నటరాజ్ సుబ్రమణియమ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలిసింది.
ఏఎల్ విజయ్ నిర్మాత...
ది మద్రాస్ మర్డర్ వెబ్‌సిరీస్‌ను కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడిగా తమిళంలో విక్రమ్ నాన్న, దళపతి విజయ్ తలైవా, కంగనా రనౌత్ తలైవితో పాటు పలు సినిమాలు చేశాడు ఏఎల్ విజయ్. ఏఎల్ విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ అనువాదమయ్యాయి. ఏఎల్ విజయ్ అసిస్టెంట్ సూర్య ప్రతాప్ ది మద్రాస్ మర్డర్ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.
సోనీ లివ్ ఓటీటీలో...
మద్రాస్ మర్డర్ వెబ్‌సిరీస్ సోనీలివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ జరుగుతోన్నట్లు సమాచారం. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. తమిళంతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
హీరోలు అనుమానితులు...
ఫిల్మ్ జర్నలిస్ట్ సీఎల్ లక్ష్మీనాథన్ 1944లో హత్యకు గురయ్యాడు. అతడిపై దుండగులు ఎటాక్ చేసి కత్తితో పొడిచి చంపేశారు. లక్ష్మీనాథన్ హత్యకేసు విచారణ దాదాపు మూడేళ్ల పాటు సాగింది. లక్ష్మీనాథన్ హత్య కేసులో అప్పటి తమిళ హీరోలు త్యాగరాజ భగవతార్, ఎస్ ఎన్ కృష్ణన్‌లతో పాటు డైరెక్టర్ శ్రీరాములు నాయుడులకు సంబంధం ఉందని భావించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో హీరోలు త్యాగరాజ భగవతార్, ఎస్, ఎన్ కృష్ణన్‌లు లక్ష్మీనాథన్‌ను హత్య చేయించారని తేలింది. డైరెక్టర్ శ్రీరాములు నాయుడిని నిర్ధోషిగా కోర్టు పేర్కొన్నది. లక్ష్మీనాథన్ మర్డర్ కేసులో దాదాపు మూడేళ్ల పాటు త్యాగరాజభగవతార్, ఎస్ ఎన్ కృష్ణన్‌లు జైలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానం వారిని నిర్ధోషులుగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అసలు నిందితులు ఎవరనే మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.
లాయర్ పాత్రలో...
అన్‌సాల్వ్‌డ్ మర్డర్ మిస్టరీగా మిగిలిన లక్ష్మీనాథన్ కేసు ఆధారంగా ది మద్రాస్ మర్డర్ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ఇందులో నజ్రియా నజీమ్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. శంతను ఓ హీరోగా నటిస్తోండగా, నటరాజ సుబ్రమణియమ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు.
అంటే సుందరానికితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
బెంగళూరు డేస్, ట్రాన్స్‌తో పాటు పలు మలయాళ సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్. ఈ సినిమాల షూటింగ్‌లోనే వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారడంతో 2014లో పెళ్లిపీటలెక్కారు. రాజా రాణితో తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువైంది నజ్రియా నజీమ్. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.