Nayanthara: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో నయనతార రొమాన్స్ - కుర్రహీరోతో కెమిస్ట్రీ మామూలుగా ఉండదటా!
Nayanthara: నయనతార కొత్త తమిళ మూవీ షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది. ఈ సినిమాలో తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన కుర్రహీరోతో నయనతార రొమాన్స్ చేయబోతున్నది.
Nayanthara: నయనతార కొత్త మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో తనకంటే వయసులోఐదేళ్లు చిన్నవాడైన యంగ్ హీరోతో నయనతార రొమాన్స్ చేయబోతున్నది. ఆ హీరో మరెవరో కాదు... కోలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న కెవిన్. నయనతార, కెవిన్ జంటగా తమిళంలో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ద్వారా లోకేష్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవాన్ దర్శకుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది.
పోస్టర్ వైరల్...
నయనతారతో పాటు కెవిన్ ఈ మూవీ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.ఈ పోస్టర్‌లో నయనతార, కెవిన్ ఒకరి కళ్లల్లోకి మరొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ కనిపిస్తోన్నారు. ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
రొమాంటిక్ లవ్‌స్టోరీ...
తనకంటే వయసులో చిన్నవాడైన ఓ యువకుడితో ప్రేమలో పడ్డ మహిళ కథతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. వారి ప్రేమకథకు కుటుంబంతో పాటు సమాజం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది రొమాన్స్, కామెడీని మేళవించి ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నయన్, కెవిన్ కెమిస్ట్రీ కొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు. కథానుగుణంగా కొన్ని లిప్‌లాక్ సీన్స్ ఉంటాయని అంటున్నారు.
బిగ్‌బాస్ తో ఫేమస్...
తమిళ బిగ్‌బాస్ సీజన్ 3లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయిన కెవిన్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ కోలీవుడ్ సినీ వర్గాలతో పాటు అభిమానులను మెప్పిస్తోన్నాడు. కెవిన్ హీరోగా నటించిన లిఫ్ట్, దాదా సినిమాలు పెద్ద విజయాల్ని సాధించాయి. ఇటీవల రిలీజైన స్టార్ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.
పదకొండు సినిమాలు...
మరోవైపు కొన్నాళ్లుగా కోలీవుడ్‌లో నయనతార బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అవుతూ వస్తోన్నాయి. అన్నపూర్ణి, ఇరవైన్‌తో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తమిళం, మలయాళ భాషల్లో కలిపి ఏకంగా పదకొండు సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా నయనతార కొనసాగుతోంది.ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నన్‌గట్టి, గుడ్ బ్యాడ్ అగ్లీ, తనీ ఓరువన్ 2తో పాటు మరో ఆరు సినిమాలు చేస్తోంది నయనతార.
తెలుగుకు బ్రేక్...
కన్నడంలో యశ్ టాక్సిక్, మలయాళంలో డియర్ స్టూడెంట్స్‌తో పాటు మమ్ముట్టితో ఓ యాక్షన్ ఫిల్మ్స్ చేస్తోంది. గత ఏడాది జవాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తమిళం, మలయాళంలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోన్న నయనతార తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2022లో చిరంజీవి గాడ్‌ఫాదర్ తర్వాత తెలుగులో కొత్త సినిమా అంగీకరించలేదు నయనతార.