మెగా 157 మూవీ సందడి మాములుగా లేదు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగా స్టార్ చిరంజీవి తొలిసారి కలిసి సినిమా చేయబోతుండటంతో హైప్ నెలకొంది. అనిల్ మార్క్ కామెడీ కమర్షియల్ మూవీలో చిరంజీవి ఎలా ఉంటారోననే ఆత్రుత అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ నటి నయనతారను తీసుకున్న సంగతి తెలిసిందే. చిరు, నయనతార కలిసి గతంలో రెండు సినిమాలు చేశారు.
చిరంజీవి-నయనతార మూడో సారి జతకట్టారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా 157 కోసం మరోసారి కలిశారు. గతంలో చిరు-నయనతార రెండు సినిమాలు చేశారు. 2019లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’, 2022లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరు-నయనతార జోడీ అలరించింది. కానీ ఈ రెండు సినిమాల్లోనూ ఈ ఇద్దరి మధ్య రిలేషన్ డిఫెరెంట్ కావడం విశేషం.
చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించింది నయనతార. బ్రిటీష్ వాళ్లపై పోరాడిన ఉద్యమ కారుడు సైరా నరహింహారెడ్డి కథతో తీసిన మూవీలో చిరుకు వైఫ్ గా నయనతార యాక్ట్ చేసింది. ఈ మూవీ మంచి హిట్ గా నిలిచింది. ఉద్యమం కోసం వెళ్లే భర్తకు సపోర్ట్ గా నిలిచే క్యారెక్టర్ లో ఒదిగిపోయింది నయనతార.
ఇక 2022లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ మరో లెవల్. ఇందులో చిరంజీవి, నయనతార బ్రదర్ అండ్ సిస్టర్ గా కనిపించడం గమనార్హం. గాడ్ ఫాదర్ గా చిరంజీవి స్వాగ్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ మూవీలో ఆరంభంలో అన్నను దూరం పెట్టి, మొండిగా బతికే చెల్లిగా యాక్ట్ చేసింది నయనతార. ఆ తర్వాత నిజాలు తెలుసుకుని అన్న చెంతకే చేరుతుంది. ఈ మూవీలో చిరంజీవి, నయనతార మధ్య అన్నాచెల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయింది.
మెగా 157 అంటూ చిరంజీవిని కొత్తగా చూపించేందుకు రెడీ అయ్యాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కమర్షియల్ సినిమాలతో కచ్చితంగా హిట్లు కొడుతున్న అనిల్.. చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందించాలని చూస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేశ్ కు కెరీర్ హిట్ ఇచ్చాడు అనిల్. ఇప్పుడు చిరంజీవికి కూడా అలాంటి సూపర్ హిట్ పడుతుందేమో చూడాలి.
మెగా 157 కోసం చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. మరి ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి. మూడేళ్ల విరామం తర్వాత తెలుగులో డైరెక్ట్ గా నయనతార చేస్తున్న మూవీ ఇదే. చివరిగా చిరంజీవితోనే గాడ్ ఫాదర్ చేసింది.
సంబంధిత కథనం