Nayanthara on Casting Couch: దక్షిణాదిన హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. తెలుగులో అడపా దడపా కనిపించినప్పటికీ తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయన్.. కెరీర్ ప్రారంభంలో కొన్ని చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నట్లు స్పష్టం చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని స్పష్టం చేసింది.
ఇటీవల మీడియాతో మాట్లాడిన నయన్.. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో కీలక పాత్ర కోసం తమకు ఫేవర్ చేయాలని ఆడిగారని, కానీ తాను మాత్రం ఎలాంటి ఫేవర్ చేయలేనని ఖరాకండిగా తిరస్కరించినట్లు స్పష్టం చేసింది. తను కేవలం తన టాలెంట్, నైపుణ్యాన్ని మాత్రమే నమ్ముకున్నట్లు పేర్కొంది. దీంతో ఆమె ధైర్యానికి పలువురు హర్షం వక్తం చేస్తున్నారు. నటనతోనే కాకుండా, వ్యక్తిగతంగానూ అభిమానులను ఆకట్టుకుంటోందీ ముద్దుగుమ్మ.
క్యాస్టింగ్ కౌచ్ గురించి నయన్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఇప్పటికే రెండు, మూడు సార్లు బహిరంగంగానే ఈ విషయంపై స్పందనను తెలియజేసింది. వినోద రంగంలో బయటకు తెలియని చాలా చీకటి కోణాలు, కథలు పరాదల చాటున ఉన్నాయని తెలిపింది. గతంలో అనుష్క కూడా ఈ విషయం గురించి తెలియజేసింది. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కేవలం తన యాక్టింగ్స్ స్కిల్స్‌తోనే ఇక్కడ వరకు వచ్చానని చెప్పింది.
నయనతార తన యాక్టింగ్ కెరీర్‌ను 2005లో ప్రారంభించింది. రజినీకాంత్ చంద్రముఖి సినిమాతో ఆమెకు బ్రేక్ వచ్చింది. అనంతరం ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు ఆమెపై వార్తలు వచ్చాయి. అంతేకాకుండా చాలా వివాదాల్లోనూ ఇరుక్కుంది. కానీ వీటిన్నింటినీ ఎదుర్కొన్ని ఇప్పటికీ తనదైన నటనతో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
నయనతార చివరగా తెలుగులో గాడ్‌ఫాదర్ సినిమాలో కనిపించింది. ఇది కాకుండా కనెక్ట్ అనే సినిమాల్లోనూ మెరిసింది. ఇప్పటికీ అరడజనుకు పైగా చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం తమిళంలో ఇరైవన్ అనే సినిమాలో నటిస్తోంది.