చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కోసం నయనతార ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోందా? కారణం ఇదేనా?-nayanthara remuneration for mega 157 revealed lady super star charging just 6 crores for chiranjeevi anil ravipudi movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కోసం నయనతార ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోందా? కారణం ఇదేనా?

చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కోసం నయనతార ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోందా? కారణం ఇదేనా?

Hari Prasad S HT Telugu

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా 157 మూవీ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా కోసం నయనతార చాలా తక్కువ రెమ్యునరేషన్ కే అంగీకరించినట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మరి దానికి కారణమేంటో చూడండి.

మెగా 157 మూవీ షూటింగ్ ప్రారంభం.. చిరంజీవిపై క్లాప్

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ లో సంక్రాంతి మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి మెగా 157 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శుక్రవారమే (మే 23) ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా తక్కువ రెమ్యునరేషన్ కే సినిమా అంగీకరించినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.

నయన్ రెమ్యునరేషన్ ఇంతేనా?

చిరంజీవి 157వ సినిమాలో నయనతారకే అవకాశం ఇవ్వాలని మొదట భావించారు. అయితే ఆమె ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గారు. మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ సమయంలో నయన్ టీమ్ మళ్లీ వాళ్లను సంప్రదించింది.

ఇందులో తన పాత్ర ఆమెకు బాగా నచ్చడం, అది కూడా తక్కువ సమయం పాటే ఉండటంతో కేవలం రూ.6 కోట్లకే చేయడానికి ఆమె అంగీకరించిందని ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. అంతేకాదు ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయాలని కూడా ఆమె బలంగా భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఈమధ్యకాలంలో ఆమె తీసుకున్న అతి తక్కువ రెమ్యునరేషన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ మధ్యే నయనతారే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ అని అనౌన్స్ చేసి, ఆమెతో ఓ చిన్న ప్రమోషనల్ వీడియోను కూడా అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ సమయంలోనూ ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటుందని కూడా మేకర్స్ వెల్లడించారు.

మొదలైన మెగా 157 షూటింగ్

ఇక చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ శుక్రవారం (మే 23) ప్రారంభమైంది. హైదరాబాద్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాడు. తాజాగా సంక్రాంతికి విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తో మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సినిమాను నిర్మిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం