Horror OTT: థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి నయనతార హారర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Horror OTT: నయనతార హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ మాయానిజాల్ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓ టీటీలోకి వస్తోంది. ఆహా తమిళ్ ఓటీటీలో ఆగస్ట్ 30 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మాయానిజాల్ మూవీలో కుంచకోబోబన్ హీరోగా నటించాడు.
Horror OTT: నయనతార హీరోయిన్‌గా నటించిన మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ నిజాల్ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. 2021లో రిలీజైన ఈ మలయాళం మూవీలో కుంచకోబోబన్ హీరోగా నటించాడు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ మలయాళంలో మిక్సడ్ టాక్‌ను తెచ్చుకున్నది. ఈ సినిమాకు అప్పు ఎన్ భట్టాత్రి దర్శకత్వం వహించాడు.
ఆహా తమిళ్ ఓటీటీలో...
నిజాల్ మూవీ తమిళంలో మాయానిజాల్ పేరుతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆహా తమిళ్ ఓటీటీలో ఆగస్ట్ 30 నుంచి హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా తమిళ్ ఓటీటీ ఆఫీషియల్‌గా వెల్లడించింది. సినిమా టీజర్‌ను పంచుకున్నది.
మాయా నిజాల్ కథ ఇదే...
ఇందులో జాన్ అనే న్యాయమూర్తి పాత్రలో కుంచకోబోబన్ నటించాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా ముఖానికి వింతైన మాస్క్ ధరించాల్సివస్తుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత జాన్ జీవితం మొత్తం తలక్రిందులవుతుంది. తన కళ్లముందు లేని సంఘటనలను జరుగుతున్నట్లుగా ఊహించడం మొదలుపెడతాడు. నితిన్ అనే పిల్లాడు...30 ఏళ్ల క్రితం జరిగిన ఓ మర్డర్ కేసును పూసగుచ్చినట్లు స్కూల్ బుక్‌లో రాస్తాడు.
పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో నిజంగానే ఆ మర్డర్ జరిగినట్లుగా తేలుతుంది. తన కొడుకు రాసిన మర్డర్ స్టోరీ చూసి ఆ పిల్లాడి తల్లి షర్మిల (నయనతార) షాకవుతుంది. నితిన్ ఈ హత్యను ఎలా ఊహించాడు? చనిపోయిన వ్యక్తి ఎవరు? 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ మర్డర్ కేసును జాన్ సాల్వ్ చేశాడా? ఈ హత్యతో షర్మిలకు ఎ లాంటి సంబంధం ఉంది అన్నదే మాయా నిజాల్ మూవీ కథ.
యావరేజ్...
కథతో పాటు కుంచకోబోబన్, నయనతార యాక్టింగ్‌కు ప్రశంసలు వచ్చినా కాన్సెప్ట్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద నిజాల్ మూవీ యావరేజ్‌గా నిలిచింది.
11 సినిమాలు...
ప్రస్తుతం సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా నయనతార తమిళం, మలయాళ భాషల్లో 11 సినిమాలు చేస్తోంది. మంగట్టి సిన్స్ 1980, తని ఒరువన్‌తో పాటు కన్నడంలో యశ్ టాక్సిక్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సికిందర్‌లో నయనతార ఐటెంసాంగ్ చేస్తోంది.
జవాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ...
గత ఏడాది షారుఖాన్ జవాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జవాన్ హిట్‌తో బాలీవుడ్‌లో నయనతారకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తెలుగు సినిమాలకు మాత్రం నయనతార దూరంగా ఉంటోంది. తెలుగులో చివరగా చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీలో నయనతార కనిపించింది. ఈ మలయాళ రీమేక్ మూవీలో హీరోయిన్‌గా కాకుండా చిరంజీవి సోదరిగా నయనతార నటించడం గమనార్హం.