Nayanthara Look in Godfather: గాడ్‌ఫాద‌ర్ కొత్త అప్‌డేట్ - సీఎం కూతురి గా న‌య‌న‌తార‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌-nayanthara first look from chiranjeevi godfather unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nayanthara First Look From Chiranjeevi Godfather Unveiled

Nayanthara Look in Godfather: గాడ్‌ఫాద‌ర్ కొత్త అప్‌డేట్ - సీఎం కూతురి గా న‌య‌న‌తార‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 08, 2022 10:30 AM IST

Nayanthara Look in Godfather: చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టిస్తున్న గాడ్‌ఫాద‌ర్ (Godfather) సినిమా ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో న‌య‌న‌తార కీల‌క పాత్ర పోషిస్తోంది.నయన్ ఫ‌స్ట్‌లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు.

న‌య‌న‌తార
న‌య‌న‌తార (Twitter)

Nayanthara Look in Godfather: గాడ్‌ఫాద‌ర్‌తో ద‌స‌రాకు అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. పొటిలిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో బాలీవుడ్ అగ్ర స‌ల్మాన్‌ఖాన్ (Salman khan) గెస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

న‌య‌న‌తార (Nayanthara) కీల‌క పాత్ర పోషిస్తోంది. నయన్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను గురువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. స‌త్య‌ప్రియ జ‌య్‌దేవ్ పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌బోతున్న‌ది. టైప్ మిష‌న్‌పై సీరియ‌స్‌గా అక్ష‌రాల్ని టైప్ చేస్తూ న‌య‌న్ క‌నిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్‌లో డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. సీఏం కూతురిగా ఆమె క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆమె ఫ్యామిలీకి ఎదురైన స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే గాడ్‌ఫాద‌ర్‌గా చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు.

రిలీజ్ డేట్ పై క్లారిటీ...

గాడ్‌ఫాద‌ర్ సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. పోస్ట్‌పోన్ అవుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు రూమ‌ర్ అంటూ పేర్కొన్న‌ది. అక్టోబ‌ర్ 5న సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ ఆధారంగా గాడ్‌ఫాద‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది.

గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు మోహ‌న్‌రాజా ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు. స‌త్య‌దేవ్, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. ఈ నెలాఖ‌రున జ‌రుగ‌బోయే గాడ్‌ఫాద‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెస్ట్‌గా హాజ‌రుకాబోతున్న‌ట్లు తెలిసింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.