దసరాకు మన శంకర వరప్రసాద్ గారు నుంచి సర్‌ప్రైజ్‌.. ఇవాళ నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్.. చీరలో శశిరేఖ-nayanthara as sasirekha in mana shankara vara prasad garu first look released surprise for dasara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  దసరాకు మన శంకర వరప్రసాద్ గారు నుంచి సర్‌ప్రైజ్‌.. ఇవాళ నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్.. చీరలో శశిరేఖ

దసరాకు మన శంకర వరప్రసాద్ గారు నుంచి సర్‌ప్రైజ్‌.. ఇవాళ నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్.. చీరలో శశిరేఖ

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’. ఈ మూవీలో నుంచి హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రేపు దసరా సందర్భంగా సర్ ప్రైజ్ ఉంటుందని అనౌన్స్ చేశాడు డైరెక్టర్.

మన శంకరవర ప్రసాద్ గారు సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్ (x/AnilRavipudi)

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ సినిమా ‘మన శంకరవర ప్రసాద్ గారు’. ఇందులో నయనతార హీరోయిన్. సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న మూవీ ఇది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 1) మన శంకరవర ప్రసాద్ గారు హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ ను అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు.

శశిరేఖగా నయనతార

మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ నయనతార శశిరేఖ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. శశిరేఖగా నయనతారను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

‘‘మన శంకరవర ప్రసాద్ గారు నుంచి శశిరేఖగా నయనతారను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ అందమైన పాత్రలో ఆమె ఉండటం, ఆమెతో పని చేయడం అంతులేని ఆనందాన్ని అందిస్తుంది. రేపు మన శంకరవర ప్రసాద్ గారు నుంచి సర్ ప్రైజ్ కోసం రెడీగా ఉండండి’’ అని అనిల్ ఎక్స్ లో పేర్కొన్నాడు.

ఏంటా సర్ ప్రైజ్?

మన శంకరవర ప్రసాద్ గారు సినిమా నుంచి దసరా సందర్భంగా రేపు (అక్టోబర్ 2) సర్ ప్రైజ్ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి హైప్ కలిగించాయి. చిరును వింటేజీ లుక్ లో చూపించేసరికి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి దసరా సందర్భంగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేస్తారా? లేకపోతే సాంగ్ ఏదైనా విడుదల చేస్తారా? అన్నది చూడాలి.

శంకరవరప్రసాద్ గారు గ్లింప్స్

మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన మన శంకరవరప్రసాద్ గ్లింప్స్ మరింత ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌లో చిరంజీవిని డిఫరెంట్ లుక్స్‌తో కొన్ని షాట్స్ చూపించారు. సూట్ వేసుకుని సిగరెట్ తాగుతూ కారులో నుంచి దిగే సీన్, పెద్ద గ్యాంగ్‌తో గ్యాంగ్‌స్టర్‌లా రావడం, మెట్లపై నుంచి గన్ పట్టుకుని స్టైలిష్‌గా నడుచుకుంటూ రావడం అన్ని అదిరిపోయేలా ఉన్నాయి.

సంక్రాంతికి రిలీజ్

గ్లింప్స్‌లో "మన శంకరవరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పడం ఆకట్టుకుంది. ఇలా అన్ని రకాలుగా మెగా 157 టైటిల్ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. ఇకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం