Rautu Ka Raaz OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - ట్విస్ట్‌లను గెస్ చేయడం కష్టమే
Rautu Ka Raaz OTT: నవాజుద్ధీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ రౌతు కా రాజ్ మూవీ డైరెక్ట్‌గా జీ5 ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Rautu Ka Raaz OTT: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన రౌతు కా రాజ్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ హిందీ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రౌతు కా రాజ్ రిలీజైంది.
ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో దీపక్ నేగి అనే పోలీస్ పాత్రలో సవాజుద్ధీన్ సిద్ధిఖీకనిపించాడు. ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది.
మర్డర్ ఎవరు చేశారు...
పదిహేనేళ్లుగా ఎలాంటి క్రైమ్‌లు జరగని రౌతు కీ బేలి ఊళ్లో ఓ మర్డర్ జరుగుతుంది. అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారుతుంది. ఆ ఊరి పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ దీపక్ నేగి (నవాజుద్దీన్ సిద్ధిఖీ), ఇన్‌స్పెక్టర్ దిమ్రి (రాజేష్ కుమార్) కలిసి ఈ కేసును ఎలా ఛేదించారు?
వార్డెన్‌ను ఎవరు హత్య చేశారు? అసలైన దోషులను పట్టుకునే క్రమంలో దీపక్, దిమ్రిలకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ. మర్డర్ మిస్టరీ కామెడీని జోడించి దర్శకుడు ఆనంద్ సూరాపూర్ ఈ మూవీని తెరకెక్కించాడు.
హడ్డి తర్వాత....
ఈ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీతోపాటు రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి కీలక పాత్రలు పోషించారు. రౌతు కా రాజ్ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నవాజుద్ధీన్ సిద్ధిఖీ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఓటీటీ ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. గత నవాజుద్ధీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన హడ్డి మూవీ కూడా గత ఏడాది జీ5 ఓ టీటీలోనే నేరుగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. రౌతు రా రాజ్‌తో ఓటీటీలో సెకండ్ హిట్‌ను నవాజుద్ధీన్ సిద్దిఖీ అందుకున్నాడు. రౌతు కా రాజ్ మూవీ ఇటీవల 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గాలా ప్రీమియర్‌గా ప్రదర్శించారు. డైరెక్ట్‌గా ఓటీటీ కోసమే ఈ మూవీని రూపొందించినట్లు సమాచారం.
ఊహించని ట్విస్ట్‌లతో....
నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ రౌతు కా రాజ్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ జానర్‌లో ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఉత్తరాఖండ్‌లోని ప్రజల యాస భాషలు, వారు ప్రవర్తను రియలిస్టిక్‌గా ఈ సినిమాలో చూపించాం. థ్రిల్లర్ సినిమానే అయినా అంతర్లీనంగా వచ్చే కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది.
ఓ మర్డర్ చూట్టూ ఈ మూవీ సాగుతుంది. ఆ హత్య ఎవరు చేశారన్నది చివరి వరకు థ్రిల్లింగ్‌ను పంచుతుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆహుతుల్ని మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ చక్కటి ఆదరణను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపాడు.
ఎక్కువగా ఓటీటీలోనే...
గత కొన్నేళ్లుగా నవాజుద్ధీన్ సిద్ధిఖీ నటించిన సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీలోనే ఎక్కువగా రిలీజ్ అవుతోన్నాయి. అతడి గత సినిమాలు గూమ్‌ఖేత్, రాత్ అఖేలీ హై, టీకు వెడ్స్ మను, హడ్డీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజయ్యాయి. తాజాగా రౌతు కా రాజ్ మూవీ కూడా ఓటీటీలోకే రిలీజ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
సైంధవ్‌తో టాలీవుడ్...
వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ మూవీతో ఈ ఏడాది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నవాజుద్ధీన్ సిద్ధికీ. ఈ యాక్షన్ మూవీలో విలన్‌గా నటించాడు. కానీ కథలో కొత్తదనం మిస్సవ్వడంతో ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ప్రస్తుతం హిందీలో ఆయిల్‌కుమార్,అద్భుత్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ.