కన్నడ యంగ్ యాక్టర్ నవీన్ శంకర్ హీరోగా నటించిన నొడిదవరు ఎనంతారే చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రానికి కుల్దీప్ కరియప్ప దర్శకత్వం వహించారు. నొడిదవరు ఎనంతారే మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
నొడిదవరు ఎనంతారే మూవీ రేపు (మార్చి 21) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందనే సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికి కన్నడలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. డబ్బింగ్ వెర్షన్‍లపై క్లారిటీ లేదు. కన్నడ మాత్రం అందుబాటులోకి రానుంది.
నొడిదవరు ఎనంతారే మూవీలో జీవితంలో వరుసగా కష్టాలను ఎదుర్కొనే యువకుడిగా నటనతో మెప్పించారు నవీన్ శంకర్. ఈ చిత్రాన్ని భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు దర్శకుడు కుల్దీప్ కరియయప్ప. అపూర్వ భరద్వాజ్, పద్మావతి రావ్, ఆర్య కృష్ణ, రాజేశ్, సోనూ గౌడ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
హిప్పో, కిడ్డో మెషన్ పిక్చర్స్ పతాకంపై నగేశ్ గోపాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. మయూరేశ్ అధికారి సంగీతం అందించారు. ఈ సినిమాకు మంచి టాకే వచ్చినా పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
వెబ్ డిజైనర్‌గా పని చేసే యవకుడు సిద్ధార్థ్ (నవీన్ శంకర్) జీవితంలో వరుసగా కష్టాలను ఎదుర్కొంటాడు. చిన్నతనంలో తల్లి ఇల్లు వదిలి వెళ్లగా.. నాన్న అతడిని పెంచుతాడు. తన గర్ల్ ఫ్రెండ్ (సోనూ గౌడ)తో సిద్ధార్థ్ విడిపోతాడు. బాధతో ఉండడం వల్ల వర్క్ కూడా సరిగా చేయడు. మహిళలను ద్వేషిస్తాడు. ఇంతలోనే సిద్ధార్థ్ తండ్రి కూడా మరణిస్తాడు. ఉద్యోగం కూడా పోతుంది. ఇక జీవితంలో ఏమీ లేదనే నిరాశతో అలుపెరగకుండా ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు సిద్ధార్థ్. ఈ జర్నీలో నాడియా (అపూర్వ భరద్వాజ్), షెఫర్డ్ మల్లన్న (రాజేశ్) అతడికి పరిచయం అవుతారు. వీరి పరిచయంతో సిద్ధార్థ్ మారాడా.. జీవితంపై ఆశలు చిగురించాయా.. జర్నీ ఎలా సాగిందనే అంశాల చుట్టూ ఈ నొడిదవరు ఎనంతారే మూవీ సాగుతుంది. ఈ చిత్రం ఎమోషనల్‍గా, హార్ట్ టచింగ్‍గా ఉంటుంది. అయితే, కాస్త స్లోగా అనిపిస్తుంది.
కాగా, తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (నీక్) కూడా రేపే (మార్చి 21) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. పవీశ్ నారాయణ్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ సరిగ్గా నెలకు ప్రైమ్ వీడియోలో అడుగుపెడుతోంది.
సంబంధిత కథనం