తెలుగు టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర హీరోగా సినిమాలు చేస్తూనే.. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లోనూ నటిస్తున్నారు. మొదటి నుంచి హీరోగా కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు నవీన్. 2023లో మంత్ ఆఫ్ మధు చిత్రంలో ఎమోషనల్ క్యారెక్టర్ చేసి ప్రశంసలు దక్కించుకున్నారు. గతేడాది కాజల్ అగర్వాల్‍తో సత్యభామ మూవీ చేశారు. 2024లోనే ఇన్‍స్పెక్టర్ రిషి, స్నేక్స్ అండే లాడర్స్ వెబ్ సిరీస్‍ల్లో అదరగొట్టారు. ఇప్పుడు వరుసగా థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నవీన్ చంద్ర. ఆ మూడు సినిమాలు ఏవంటే..
నవీన్ చంద్ర, పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో ‘షో టైమ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్‍గా వచ్చింది. పోలీస్ తలుపు వద్ద నిలబడగా.. త భార్య, కూతురుకు రక్షణగా నవీన్ చంద్ర చేయి అడ్డుపెట్టినట్టుగా ఈ పోస్టర్ ఇంటెన్స్ లుక్‍తో ఉంది. అనుకోకుండా ఎదురైన కష్టం నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్న స్టోరీతో ఈ మూవీ రానున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండనుందని తెలుస్తోంది. 'షో టైమ్’ టైటిల్ ఉండడం ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీని చంద్రశేఖర్ మహాదాస్, పుష్యమిత్ర ప్రొడ్యూజ్ చేస్తున్నారు.
రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ‘28డిగ్రీస్ సెల్సియస్’ చిత్రం రానుంది. ఈ మూవీలో నవీన్ చంద్ర, షాలినీ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి కూడా ఓ కీలకపాత్ర చేశారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శత్వం వహించారు. 2017లోనే మొదలైన ఈ 28డిగ్రీస్ సెల్సియస్ చిత్రం చాలా వాయిదాల తర్వాత ఇప్పుడు విడుదలవుతోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా అనిపించింది. టైటిల్ కూడా చాలా డిఫరెంట్‍గా ఉంది.
నవీన్ చంద్ర హీరోగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఎలెవెన్ చిత్రం రానుంది. తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. రెయా హరి, శశాంక్, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. లోకేశ్ అజిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ గతేడాదే కంప్లీట్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఎలెవెన్ మూవీని ఈ ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వరుసగా మూడు డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నవీన్.
సంబంధిత కథనం